నవంబర్ 5 న ఆటోడ్రైవర్ల మహా ధర్నా | Hyderabad Auto Drivers Maha Dharna on 5th November

WhatsApp Group Join Now

ఆటో డ్రైవర్ల వినూత్న పోరాటం

తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 5న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద భారీ స్థాయిలో ఆటో డ్రైవర్ల మహాధర్నా జరగనుంది. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, ఆంక్షలకు భయపడకుండా డ్రైవర్లు తాము ముందుకు సాగుతామని యూనియన్ స్పష్టం చేసింది.

మహాధర్నా విజయవంతం చేయాలనే సంకల్పం

మహాధర్నాకు ఆటంకం కలిగించడానికి ప్రభుత్వం పలు కుట్రలు పన్నినా, డ్రైవర్లు మాత్రం వెనుకడుగు వేయకుండా, ఏకమై అందరూ తరలి రావాలని యూనియన్ పిలుపునిచ్చింది. ఈ ధర్నా ద్వారా తమ సమస్యలను పరిష్కరించాలని, తమ గొంతుక వినిపించేందుకు ఇదే సమయమని వారు చెప్పారు.

కాంగ్రెస్‌పై విమర్శలు

ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ పాలనే ప్రధాన కారణమని యూనియన్ ఆరోపించింది. ప్రజా పాలన అనేది పేరుకు మాత్రమే అవుతున్నదని, వాస్తవానికి ఆంక్షల పేరుతో పేదవారి జీవనాన్ని మరింత కష్టపెడుతున్నారని విమర్శించింది.

వాహన సంఘాల ఐక్యత

వివిధ వాహన సంఘాలు కలసి మహాధర్నాను విజయవంతం చేయాలని యూనియన్ ప్రతినిఘులు తెలిపారు. ఆంక్షల పేరుతో ప్రభుత్వ వేధింపులను తిప్పికొట్టే ఆత్మబలంతో డ్రైవర్లు ఎవరూ వెనుకడుగు వేయకూడదని ఈ ధర్నా నిర్వహణకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్  ధర్నా కు KTR గారిని కూడా ఆహ్వానించారు

ఇవి కూడా చదవండి

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరులపై మావోయిస్టుల హెచ్చరిక

జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థుల ఆందోళన

వీడియో

Hyderabad Auto Drivers Protest on November 5th

Leave a Comment