హైదరాబాద్‌లో హైడ్రా ఆగడాలు, నిరుపేదలు ఆత్మహత్యాయత్నం | HYDRA Demolitions in Hyderabad

WhatsApp Group Join Now

హైదరాబాద్‌లోని చెరువులను రక్షించేందుకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అథారిటీ) కఠిన చర్యలు చేపడుతోంది. ఆదివారం రోజున అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మరింత తీవ్రంగా మారింది.

మాదాపూర్ సున్నం చెరువు పూర్తిగా ట్యాంక్ లెవెల్ (FTL)లో అక్రమంగా నిర్మించిన అపార్ట్మెంట్లు హైడ్రా కూల్చివేసింది. అలాగే, మల్లంపేటలోని విల్లాలు, చెరువు పరివాహక ప్రాంతంలో (బఫర్ జోన్) ఉన్నాయని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించబడ్డాయని అధికారుల ఆధీనంలో కూల్చివేయబడినవి.

బాధితులు, తమ నిర్మాణాలు అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసినవేనని, వీటిని బఫర్ జోన్‌లోకి వస్తాయని తెలియకుండానే నిర్మించారని వాపోయారు. నోటీసులు లేకుండా అకస్మాత్తుగా కూల్చివేయడం వల్ల మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

HYDRA Demolitions in Hyderabad
హైదరాబాద్‌లో హైడ్రా ఆగడాలు, నిరుపేదలు ఆత్మహత్యాయత్నం

మాదాపూర్ సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతల సమయంలో బాధితులు నిరసనగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు తక్షణమే వారి ప్రయత్నాన్ని అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానిక ప్రజలలో భయాన్ని కలిగించింది, మరియు హైడ్రా చర్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ప్రజలు తమ కష్టార్జితంతో సంపాదించిన ఇళ్లను కళ్లముందే కూల్చివేయడం చూస్తుండి అవేదన చెందుతున్నారు. రామోజీ రావు, ఒవైసీ లాంటి ప్రముఖుల అక్రమ నిర్మాణాలను కూల్చకుండా, మధ్యతరగతి ప్రజల ఇళ్లపై మాత్రమే చర్యలు తీసుకోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

వీడియో

Hydra Demolishes Houses in Hyderabad without Proper Notice

Webstory

Leave a Comment