పర్యావరణానికి మేలు చేసే ఉద్దేశంతో భారతీయ రైల్వే తీసుకొస్తున్న హైడ్రోజన్ రైలు, డిసెంబర్ నెలలో పట్టాలెక్కనుంది. ఇంధనంగా నీటిని వినియోగిస్తూ నడిచే ఈ రైలు, పర్యావరణ హితానికి గొప్ప సహకారం అందించనుంది. ఇతర ఇంధనాలకు బదులుగా ఈ రైలులో హైడ్రోజన్ వినియోగిస్తుండటం విశేషం.
40,000 లీటర్ల నీటి అవసరం
ఈ హైడ్రోజన్ రైలు నడిచేందుకు భారీ స్థాయిలో నీటి అవసరం ఉంది. ఒక ప్రయాణానికి 40,000 లీటర్ల నీటిని హైడ్రోజన్‌గా మార్చి ఇంధనంగా ఉపయోగిస్తారు. ఒకసారి ట్యాంక్ నింపితే, రైలు సుమారు 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ విధానం వల్ల కాలుష్యం రహితంగా రైల్వే సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
2025 నాటికి 35 హైడ్రోజన్ రైళ్లు
భవిష్యత్తులో రైల్వే ఇంధన మార్గాలను పర్యావరణ హితంగా మార్చే దిశగా, 2025 నాటికి మొత్తం 35 హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భారత రైల్వే ప్రణాళికలో ఉంది.
పర్యావరణానికి హానికరమైన ఇంధనాల వాడకాన్ని తగ్గించే ఈ క్రమంలో, హైడ్రోజన్ రైళ్లు పర్యావరణం కోసం ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.
ఇవి కూడా చదవండి
అల్లుడి కంపెనీ కోసం రైతులపై రేవంత్ రెడ్డి దౌర్జన్యాలు అంటున్న KTR
డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై కేసు నమోదు
4 thoughts on “త్వరలో రానున్న నీటితో నడిచే రైలు | Hydrogen Train Set to Launch in December”