ఏపీ డిప్యూటీ సీఎం టీమ్ లోకి ఆమ్రపాలి | IAS Officer Amrapali in to Pawan Kalyan Team

WhatsApp Group Join Now

సీనియర్ ఐఏఎస్ అధికారి కాట అమ్రపాలి, తెలంగాణలో కొనసాగేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విధుల్లో చేరారు.

కేంద్రం, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, తెలంగాణ హైకోర్టులో అనుకూల ఆదేశాల కోసం చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడంతో, అమ్రపాలి చివరికి ఆంధ్రప్రదేశ్‌లో విధులు చేపట్టాలని నిర్ణయించారు.

ఆంధ్ర ప్రభుత్వంలో కొత్త బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరిన అనంతరం, అమ్రపాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్‌ను కలసి, తనకు సవాళ్లతో కూడిన మరియు తగిన బాధ్యతలు కట్టబెట్టాలని కోరారు.

ఆమె సాయంత్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ను కూడా కలవనున్నారు.

పవన్ కళ్యాణ్ టీం లో తీసుకోనున్నారా?

హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్ గా మంచి పేరు తెచ్చుకున్న కాట ఆమ్రపాలి గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విభాగంలో తన బాధ్యతలను నిర్వస్తారని సమాచారం వినిపిస్తుంది.

ఉత్సాహవంతులైన యువ ఐఏఎస్ అధికారులు తన టీం లో చేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు, ఈమేరకు మన రాష్ట్రానికి చెందిన ఒక ఐఏఎస్ ను కేరళ నుండి  మరీ తెప్పించుకున్నారు.

GHMC కమిషనర్ గా, అలాగే ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా ఆమె చేసిన పని తీరు మెచ్చి, పవన్ గారు తన క్యాడర్ లో చేర్చుకుంటే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. 

విశాఖతో ప్రత్యేక అనుబంధం

అమ్రపాలి ప్రకాశం జిల్లాకు చెందినా, విశాఖపట్నం నగరంతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె విద్యను అక్కడే పూర్తి చేయగా, ఆమె తండ్రి కాట వెంకట్ రెడ్డి ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ కొనసాగుతున్నారు.

తన ఐఏఎస్ కెరీర్

  • 2010లో వికారాబాదు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అమ్రపాలి, అనేక కీలక బాధ్యతల్లో పని చేసి మంచి పేరు సంపాదించారు.
  • బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆమె ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.

    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా తన విధులు నిర్వహించిన సమయంలో ఆమె చేసిన పనితీరు విశేషంగా ప్రశంసించబడింది.

ఇవి కూడా చదవండి

చంద్రబాబుకు NSG కమాండోల భద్రత కట్‌

చంద్రబాబుకు ఈడీ షాక్ – ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం

వీడియో

IAS Amrapali in Pawan Kalyan Team

1 thought on “ఏపీ డిప్యూటీ సీఎం టీమ్ లోకి ఆమ్రపాలి | IAS Officer Amrapali in to Pawan Kalyan Team”

Leave a Comment