గాంధీ ఆసుపత్రిలో మరణాలు, వైద్యుల నిర్లక్ష్యం పై ఆరోపణలు | Increased Patient Deaths in Gandhi Hospital

WhatsApp Group Join Now

తెలంగాణలోని గాంధీ ఆసుపత్రిలో, ఆగస్టు నెలలో 48 మంది పసిపిల్లలు, 14 మంది గర్భిణీ స్త్రీలు మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ మరణాలకు కారణంగా వైద్యుల నిర్లక్ష్యం మరియు పౌష్టికాహార లోపం ఉన్నట్లు తెలుస్తోంది. 15 రోజులుగా ఈ వివరాలు బయటకు రాకుండా ప్రభుత్వం దాచిపెట్టినప్పటికీ, కొన్ని న్యూస్ ఛానల్ మీడియా వాళ్ళు ఈ వార్తలను సేకరించారు.

గత ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లు, కేసీఆర్ కిట్లు అందించడాన్ని ఆపేయడం వల్ల పసిపిల్లలు బరువు తక్కువగా పుట్టి మృతి చెందడం, అనుభవం లేని వైద్యులు ఆపరేషన్లు చేయడం వల్ల తల్లుల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గాంధీ ఆస్పత్రిలో మరణాల సంఖ్యనే చూస్తే, రాష్ట్రవ్యాప్తంగా మరింత ఎక్కువ సంఖ్యలో గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు మరణించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Increased patient deaths in Gandhi Hospital
గాంధీ ఆసుపత్రిలో మరణాలు, వైద్యుల నిర్లక్ష్యం పై ఆరోపణలు

గాంధీ హాస్పిటల్లో ఉన్న మరిన్ని సమస్యలు

  • సీనియర్ డాక్టర్ ఉండాల్సిన రాజీవ్ ఆరోగ్య శ్రీ మెడికల్ కోఆర్డినేటర్ గా, రిటైర్డ్ జూనియర్ అసిస్టెంట్ రామయ్యని నియమించడం.
  • ఫ్యామిలీ & హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది మరియు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం.
  • అనుభవం ఉన్న డాక్టర్లను గ్రామాలకు బదిలీ చేయడం, హైరిస్క్ కేసులను హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల మరణాలు పెరగడం.
  • గాంధీ హాస్పిటల్ లో రివ్యూ నిర్వహించకపోవడం.
  • కేసీఆర్ కిట్ మరియు న్యూట్రిషన్ కిట్ 6 నెలలుగా నిలిపివేయడం.
  • గత ప్రభుత్వం ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభించగా, ప్రస్తుతం ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ పూర్తిగా ఆపివేయడం.
  • 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న D.E.O లను ఎలాంటి కారణం లేకుండా తొలగించడం.

Webstory

1 thought on “గాంధీ ఆసుపత్రిలో మరణాలు, వైద్యుల నిర్లక్ష్యం పై ఆరోపణలు | Increased Patient Deaths in Gandhi Hospital”

Leave a Comment