కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ | Jani Master Arrested in Bangalore

WhatsApp Group Join Now

మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను బెంగళూరులో సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి SOT పోలీసులు ఒక ప్రాంతంలో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకుని ఈరోజు హైదరాబాద్ కి తరలిస్తున్నారు. సైబరాబాద్ SOT పోలీసులు నార్సింగి పోలీసులు 4 బృందాలుగా విభజింపబడి ఈ గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసు కేసు

అయితే, జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళా కొరియోగ్రాఫర్‌ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో జానీ ఆమెను బయట షూటింగుల సమయంలో లైంగికంగా వేధించాడని, బెదిరించి గాయపరిచాడని ఆరోపణలు ఉన్నాయి. నార్సింగి పోలీసులు 376, 506, 323 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Jani Master Arrested in Bangalore
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో జానీ మాస్టర్ 2019లో తనను సంప్రదించి టీమ్‌లో చేర్చుకున్నాడని, అప్పటి నుంచి తాను అతడి టీమ్‌లోనే పని చేస్తోన్నట్లు చెప్పింది. వివిధ ఔట్‌డోర్ షూటింగ్‌ల్లో మరియు జానీ ఇంటిలో కూడా లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆమె ఆరోపించింది. జానీ భార్య కూడా తనపై దాడి చేసిందని బాధితురాలు వెల్లడించింది.

లవ్ జిహాద్ ఆరోపణలు

ప్రస్తుతం ఈ కేసు విచారణ వేగంగా సాగుతోంది. బాధితురాలిని పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె మూడు గంటల పాటు సమాధానాలు ఇచ్చింది. మరోవైపు, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి జానీపై ‘లవ్ జిహాద్’ ఆరోపణలు చేస్తూ బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ప్రకటించారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో కూడా జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

నాగబాబు గారి ట్వీట్

నేరం ఏదైనా నిర్ధారించే వరకు నిందితులు గా అనుకోవద్దు, ప్రతిదీ నమ్మొద్దు అని అన్నారు.

ప్రతి కథలో 3 వెర్షన్ లు ఉంటాయని ఒకటి మీది, ఒకటి అవతల వాడిది మరొకటి నిజం అని అన్నారు.

జానీ మాస్టర్ జనసేన మనిషి అని నాగబాబు గారు వెనకేసుకొస్తున్నట్లు ఉంది అయన ట్వీట్.

ఇంకా చదవండి – కేరళలో నిఫా వైరస్ కలకలం

వీడియో

Choreographer Jani Master arrested in Bengaluru

Webstory

Leave a Comment