మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో రైతు ధర్నా కార్యక్రమంలో KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “మనం సిగ్గున్న వాళ్లకు మాత్రమే గౌరవం ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి వంటి నాయకులకు అటువంటి లక్షణాలు లేవు,” అని ఎద్దేవా చేశారు.
రుణమాఫీపై విమర్శలు
KTR రుణమాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ, “రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు, కానీ పది నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఏమీ జరగలేదు,” అని అన్నారు. “సెక్రటరియేట్ లో లంక బిందెలు అంటూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు,” అని KTR మండిపడ్డారు.
రైతులకు మోసపూరిత హామీలు
రైతులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను కేవలం మోసమని KTR ఆరోపించారు. “రైతు భరోసా పేరిట రూ. 15 వేలు ఇస్తానన్నాడు, కానీ ఇప్పుడు రైతు భరోసా కూడా లేదు,” అని KTR అన్నారు.
మూసీ ప్రాజెక్టుపై ఫిర్యాదులు
మూసీ ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పెద్ద కుంభకోణం చేస్తున్నారని KTR ఆరోపించారు. “మూసీ ప్రక్షాళన పేరుతో పెద్ద ఎత్తున పైసలు దోచుకోవడం జరుగుతోంది. ఇది బ్యూటిఫికేషన్ కాదు, లూటీఫికేషన్ మాత్రమే,” అని KTR ఘాటుగా విమర్శించారు.
పేదల ఇళ్లపై విమర్శలు
పేదల ఇళ్ల కూల్చివేతపై KTR తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “నీ ఫాంహౌసుల గురించి చెప్పు, అవే కూలగొడతాం. కానీ పేదల ఇళ్లను వదిలేయ్,” అని రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన హీరో నాగార్జున గారు
పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో కేసు నమోదు
1 thought on “కందుకూరులో రైతు ధర్నాలో KTR సంచలన వ్యాఖ్యలు | Kandukur Farmers Dharna”