కొమురవెల్లిలో ఘోరం
సిద్దిపేట జిల్లా, కొమరవెల్లి మండలం గురవన్నపేట గ్రామంలో ఒక భయంకర సంఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగిక దాడి చేశాడు.
బాలిక పరిస్థితి ఆందోళనకరం
ఈ విషయం తెలిసిన వెంటనే, బాలిక తల్లిదండ్రులు ఆమెను సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, బాలిక పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆందోళన పెరిగింది.
గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది
బాలికపై దాడి చేసిన యువకుడు వెంటనే పరారయ్యాడు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్తులు, బాలిక బంధువులు, నిందితుడి ఇంటికి చేరుకొని ఇంటికి నిప్పు పెట్టి, అతడి కార్, జేసీబీ వాహనంపై దాడి చేశారు.
నిందితుడికి గ్రామస్థుల తీర్పు
గ్రామస్థుల అభిప్రాయం ప్రకారం, నిందితుడు భవిష్యత్తులో ఇంకెవరిపైనా ఇలాంటి అఘాయిత్యం చేయకుండా అతడి కుటుంబాన్ని ఊరు నుంచి బయటకు పంపించాలని వారు నిర్ణయం తీసుకున్నారు.
పోలీసుల చర్యలు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. గ్రామస్థుల ఆగ్రహం కంట్రోల్ కాకపోవడంతో, పోలీసులు లాటీ చార్జ్ చేయాల్సి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి – హైడ్రా వేధింపులు తాళలేక కూకట్‌పల్లి మహిళ ఆత్మహత్య
3 thoughts on “కొమురవెల్లిలో ఏడవ తరగతి బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడు | Komuravelli Rape News”