KTR పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు | Konda Surekha Shocking Comments On KTR

WhatsApp Group Join Now

మాజీ మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ గారు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ మాట్లాడుతూ, సమంత-నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. కేటీఆర్ తీరుతో సినీ పరిశ్రమలో హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

నాగార్జున గారి స్పందన

ఇందుకు హీరో నాగార్జున ఘాటుగా స్పందించారు. “మీ రాజకీయాల కోసం మా కుటుంబాన్ని లాగొద్దు. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను గౌరవించండి. ఈ ఆరోపణలు అబద్ధం, అసంబద్ధం. వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి” అని ట్వీట్ చేశారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత గారు ఏమన్నారంటే?

విడాకులు నా వ్యక్తిగత విషయం. మేమిద్దరం పరస్పర సమ్మతితో విడాకులు తీసుకున్నాం. నేను ఎప్పుడూ రాజకీయాల నుంచి దూరంగా ఉంటాను. మీరు గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి. దయచేసి మీ రాజకీయాల్లో నన్ను లాగొద్దు. మా విడాకుల విషయానికి రాజకీయ నాయకులతో ఎలాంటి సంబంధం లేదు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నాను.

Konda Surekha Shocking Comments On KTR
KTR పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు

ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

ఈ వివాదంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. “సినిమాల్లో పనిచేసే మహిళలపై ఇలాంటి రాజకీయాలు సిగ్గుచేటు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ కౌంటర్

బీఆర్ఎస్ పార్టీ కొండా సురేఖ చేసిన ఆరోపణలను ఖండించింది. “ఇవి పూర్తిగా అవాస్తవాలు, చౌకబారు ఆరోపణలు” అని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.

ఇవి కూడా చదవండి

హైడ్రా పై రేవంత్ తో మాట్లాడమని రాహుల్ కు హరీష్ రావు విజ్ఞప్తి

4 వేల కోట్ల స్కాం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

వీడియో

Leave a Comment