తెలంగాణ: తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది ప్రజలపై భారమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిరిసిల్లలో జరిగిన విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, గత పది సంవత్సరాలు రాష్ట్రం కోసం స్వర్ణయుగం లా నడిచిందని, కానీ ఈ పది నెలలు కష్టకాలమని పేర్కొన్నారు.
ఉచిత విద్యుత్ పథకం
కేటీఆర్ చెప్పినట్లుగా తమ హయాంలో రైతులకు ఎలాంటి కరెంటు భారాలు పడకుండా ఉచితంగా విద్యుత్ అందించామని గుర్తు చేశారు. కానీ తాజా విద్యుత్ చార్జీల పెంపుతో కరెంటు ఖర్చు చిన్న, మధ్యతరగతి కుటుంబాలకు, చిన్న పరిశ్రమలకు దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల పరిశ్రమలపై విద్యుత్ ఛార్జీలను ఒకే తరహాలో పెంచడం అన్యాయమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ నిర్ణయంపై నిరసన
ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచాలనే ప్రతిపాదనను ఈఆర్‌సీ తిరస్కరించాలనీ, ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలనీ కోరారు.
పెద్ద పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలకు, సిరిసిల్ల నేతన్నలకు ఒకే తరహా వసతులను ఇవ్వడం తగదని విమర్శించారు. తాము అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌పై ఘాటు వ్యాఖ్యలు
ఇక కాంగ్రెస్ ఉచిత విద్యుత్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డ కేటీఆర్ ప్రజా పోరాటానికి వెనకాడమని, పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దని హితవు పలికారు.
ఇవి కూడా చదవండి
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు కరెంట్ బిల్లుల షాక్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కిన పోలీసుల భార్యలు
వీడియో
ఉచిత విద్యుత్ భారాన్ని మధ్యతరగతి, చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమల పై వెయ్యాలని ఆలోచించడం సమంజసం కాదు..
మేము 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు చార్జీలు రూపాయి కూడా పెంచలేదు.
బాధ్యతగల ERC.. ఈ విషయంలో ప్రజలు, రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి.… pic.twitter.com/hWIluzzSs2
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2024
3 thoughts on “కరెంటు చార్జీల పెంపును అడ్డుకుంటాం అంటున్న KTR | KTR Against Electricity Price Hike in Telangana”