హైడ్రా వేధింపులు తాళలేక కూకట్‌పల్లి మహిళ ఆత్మహత్య | Kukatpally Woman Committed Suicide Due to Hydra Harassments

WhatsApp Group Join Now

కూకట్‌పల్లి లో విషాదం

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. యాదవ బస్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మహిళ హైడ్రా కూల్చివేత‌ల వేధింపులతో మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని శోక‌సంద్రంలో ముంచెత్తింది.

బుచ్చమ్మకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు, వారికి కట్నంగా మూడు ఇండ్లు రాసిచ్చింది. కానీ హైడ్రా అధికారులు ఈ ఇండ్లు ఖాళీ చేయాలంటూ ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. దీనికి భయపడి, తన జీవిత సర్వస్వం అయిన ఇల్లులను కోల్పోతామన్న ఆందోళనతో బుచ్చమ్మ ఆత్మహత్యకు పాల్పడింది.

హైడ్రా అధికారుల వేధింపులపై కుటుంబ సభ్యుల ఆరోపణలు

బుచ్చమ్మ బంధువులు మరియు కుటుంబ సభ్యులు హైడ్రా అధికారుల వేధింపుల వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని ఆరోపిస్తున్నారు. తండ్రి లేకపోయినా, తల్లి రూపాయి రూపాయి కూడబెట్టుకొని కూతుళ్ల కోసం ఇళ్లు కొనుక్కుని కట్నంగా ఇచ్చింది. ఇప్పుడు ఆ ఇళ్లు కూల్చేస్తామనే భయంతో, ఆవేదనలో ఉరేసుకొని చనిపోయిందని బుచ్చమ్మ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి – విజయవాడ వరద తెచ్చిన విషాదం

వీడియో

1 thought on “హైడ్రా వేధింపులు తాళలేక కూకట్‌పల్లి మహిళ ఆత్మహత్య | Kukatpally Woman Committed Suicide Due to Hydra Harassments”

Leave a Comment