పోలీసుల దురుసు ప్రవర్తన వలన ఆసుపత్రి పాలైన కౌశిక్ రెడ్డి | MLA Padi Kaushik Reddy Arrest

WhatsApp Group Join Now

హుజురాబాద్: పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత హక్కుల కోసం నిర్వహించిన నిరసనలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో అతను స్పృహ తప్పి ఆసుపత్రిలో చేరారు.

కౌశిక్ రెడ్డిని బలవంతంగా వాహనంలోకి కుక్కి తీసుకెళ్లినప్పుడు అతడు తీవ్ర ఒత్తిడికి గురై కాసేపు ఊపిరాడక స్తంభించి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు.

దళితుల కోసం పోరాటం

దళిత బంధు అమలులో జాప్యం ఏంటని ప్రశ్నిస్తే, పోలీసులు ఈ స్థాయి నిరంకుశ చర్యలకు దిగారా? అని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. “నా దళిత బిడ్డల కోసం ప్రాణం పోయే వరకు పోరాడుతా,” అని తన ధృడతను ప్రకటించారు.

రేవంత్ రెడ్డిపై హత్యారోపణ

ఇక తనపై జరుగుతున్న ఈ దాడులకు రేవంత్ రెడ్డి పరోక్షంగా కారణమని ఆరోపిస్తూ, ఆయన “రేవంత్ రెడ్డి నా మీద హత్యాయత్నం చేయిస్తున్నాడు,” అని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇవి కూడా చదవండి

పోలీసుల దురుసు ప్రవర్తనతో మెదక్ జిల్లా వ్యక్తి ఆత్మహత్య

డబ్బు కట్టకపోతే మృతదేహం ఇవ్వనున్న మెడికవర్ హాస్పిటల్

వీడియో

2 thoughts on “పోలీసుల దురుసు ప్రవర్తన వలన ఆసుపత్రి పాలైన కౌశిక్ రెడ్డి | MLA Padi Kaushik Reddy Arrest”

Leave a Comment