Mumbai Dating Scam
ఇటీవల ముంబైలో ఒక డేటింగ్ స్కామ్ బయటపడింది. టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్‌ల ద్వారా 12 మంది పురుషులు మోసపోయారు. ఈ స్కామ్‌లో మహిళలు ఈ యాప్‌ల ద్వారా పురుషులను పరిచయం చేసుకుని, అంధేరీ వెస్ట్‌లో ఉన్న ది గాడ్‌ఫాదర్ క్లబ్ లాంటి ఫాన్సీ రెస్టారెంట్లలో పురుషులతో డేట్స్ కుదుర్చుకుని ఈ మీటింగ్స్‌లో, మహిళలు మెనూని చూపకుండా ఖరీదైన మందు, హుక్కా వంటి వాటిని ఆర్డర్ చేసేవారు, దీని వల్ల పురుషులకు ₹23,000 నుండి ₹61,000 వరకు బిల్లులు వచ్చేవి.

ఆర్డర్లు ఇచ్చిన తర్వాత, మహిళలు ఎమర్జెన్సీ అని అక్కడినుండి తప్పించుకొని వెళ్ళిపోయేవారు. వేలల్లో బిల్లులు చేసి వెళ్లిపోవడం వలన మగవాళ్ళు తెలియక ఆ బిల్లు కట్టవలసి వచ్చేది.
పురుషులు బిల్లు చెల్లించేందుకు నిరాకరించినప్పుడు, అక్కడ ఉన్న బౌన్సర్లు వారిని బెదిరిస్తారు లేదా హింసకు పాల్పడుతారు. ఈ స్కామ్‌ను న్యాయవాది, సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ వెలుగులోకి తీసుకొచ్చారు, ఆమె ఈ వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు, దీని వల్ల ఈ విషయం బాగా ప్రచారం పొందింది.
🚨 MUMBAI DATING SCAM EXPOSE 🚨
THE GODFATHER CLUB ANDHERI WEST
◾BRAZEN SCAMMING EVERYDAY
◾12 victims in touch
◾Trap laid through Tinder, Bumble
◾Bill amounts 23K- 61K
◾3 men trapped by same girl@MumbaiPolice @CPMumbaiPolice @mymalishka @CMOMaharashtra@zomato pic.twitter.com/qGOacFCE9f— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) August 23, 2024