తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకునేందుకు కోర్టు దారి పట్టిన నాగార్జున
ప్రముఖ నటుడు నాగార్జున, కాంగ్రెసు నాయకురాలు కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసినట్లు సమాచారం. కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆమె వ్యాఖ్యలు నాగార్జున కుటుంబ గౌరవాన్ని దెబ్బతీశాయని ఆరోపిస్తూ, నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో కూడా తీవ్రంగా వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.
సినీ ఇండస్ట్రీలోకి పాకిన వివాదం
కొండా సురేఖపై కోర్టు కేసు నమోదవడం తో, ఈ వివాదం మరింత తీవ్రమయ్యింది. ఇప్పటికే ఆమె వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సినీ ప్రముఖులు, సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక నాగార్జున తరఫు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో దావా వేశారు.
అఖిల్ అక్కినేని ట్వీట్
అక్కినేని అఖిల్ సైతం ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. “కొండా సురేఖ చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ఆమె తన సామాజిక బాధ్యతలను, ప్రజల సంక్షేమాన్ని మరిచారు. ఆమె ప్రవర్తన సిగ్గుచేటుగా ఉంది, ఇది క్షమించరానిది,” అని అఖిల్ ట్వీట్ చేశారు.

“నా కుటుంబ సభ్యుడిగా మరియు సినీ వర్గాల్లో భాగంగా, నేను ఈ విషయం పట్ల మౌనంగా ఉండలేను. ఇలాంటి వ్యక్తులు సమాజంలో స్థానం పొందరని, న్యాయం జరగాలని కోరుతున్నాను. ఈ వ్యవహారంలో క్షమించబడదని, సహించబడదని స్పష్టం చేశారు.”
The baseless and ridiculous statements made by Konda Surekha are vulgar and disgusting. Being a public servant who is expected to protect the people she has decided to forget her morals and social welfare. The way she has acted is shameful and unforgivable. There are respected…
— Akhil Akkineni (@AkhilAkkineni8) October 4, 2024
కేసు వాయిదా
నాంపల్లి మనోరంజన్ కోర్టులో ఈ కేసు నమోదు కాగా, న్యాయమూర్తి సెలవులో ఉన్నందున విచారణను సోమవారానికి వాయిదా వేశారు. కోర్టు సోమవారం నాడు పిటిషన్‌పై విచారణ చేయనుంది.
ఇవి కూడా చదవండి
హైడ్రా పై రేవంత్ తో మాట్లాడమని రాహుల్ కు హరీష్ రావు విజ్ఞప్తి
నందిగం సురేష్ ఆరోగ్యం విషయమై ఆందోళన చెందుతున్న భార్య
2 thoughts on “మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన హీరో నాగార్జున గారు | Nagarjuna Files Defamation Case Against Minister Konda Surekha”