భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. చివరికి నీరజ్ 88.17 మీటర్లు విసిరి రజత పతకాన్ని సాధించాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో నదీమ్, నీరజ్‌ల తొలి ప్రయత్నం ఫౌల్ అయింది. రెండో ప్రయత్నంలో నదీమ్ 92.97 మీటర్ల జావెలిన్ విసిరి ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. నదీమ్ ఇప్పటికి 10 సార్లు ఇంటర్నేషనల్ గేమ్స్ లో పోటీ చేస్తే 9 సార్లు ఓడిపోయి పదవ సారి బంగారు పథకం సాధించాడు.
నీరజ్ మాటలు
2021లో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్, తనకు గజ్జలలోని గాయం కారణంగా తాను స్వర్ణం గెలవలేకపోయానని చెప్పాడు.
“నేను విసిరినప్పుడల్లా, 60-70 శాతం దృష్టి గాయంపై ఉంటుంది. ఈ రోజు నా రన్‌వే బాగా లేదు, నా వేగం కూడా తక్కువగా ఉంది, నేను ఏమి చేసినా, నేను ఈ సమస్యతో చేసాను. నాకు శస్త్రచికిత్సకు సమయం లేదు. నేను నన్ను నేను నెట్టుతున్నాను,” అని ఇలా చెప్పాడు.
నీరజ్ యొక్క శారీరక సమస్య అతనిని స్వర్ణం గెలవకుండా నిరోధించి ఉండవచ్చు, కానీ అది అతని దేశం గర్వించేలా చేయకుండా ఆపలేకపోయింది.

నదీమ్ ను అభినందించిన నీరజ్
టోక్యో ఒలింపిక్స్ వరకు వీరిద్దరూ 7 సార్లు తలపడగా, ప్రతిసారీ నీరజ్ గెలిచారు. టోక్యోలో నదీమ్ 5వ స్థానంలో ఉన్నాడు.
గత ఎనిమిదేళ్లలో జావెలిన్ పోటీలో పాక్ అథ్లెట్‌తో తన తొలి ఓటమిని అంగీకరించే ముందు తన స్నేహితుడు నదీమ్‌ను అభినందించాడు.
“నేను 2016 నుండి అర్షద్‌పై పోటీ చేస్తున్నాను, కానీ నేను అతనితో ఓడిపోవడం ఇదే మొదటిసారి.
అర్షద్ చాలా కష్టపడ్డాడు మరియు రాత్రి నా కంటే మెరుగ్గా ఉన్నాడు. అతనికి అభినందనలు.
నీరజ్ చోప్రా తల్లి మాటలు
నీరజ్ చోప్రా యొక్క రజతం ఆమెకు స్వర్ణంతో సమానమని, తాను గాయం కారణంగా రాణించలేకపోయాడని, అయినా మేము సంతోషంగా ఉన్నామని, గెలిచినా నదీమ్ కూడా తన కొడుకు లాంటి వాడేనని తాను చెప్పారు.
#WATCH | Haryana: On Neeraj Chopra winning a silver medal in men's javelin throw at #ParisOlympics2024, his mother Saroj Devi says, "We are very happy, for us silver is also equal to gold…he was injured, so we are happy with his performance…" pic.twitter.com/6VxfMZD0rF
— ANI (@ANI) August 8, 2024
నీరజ్ చోప్రా మునుపటి మూడు జాతీయ రికార్డులు:
ఈవెంట్ | స్థలం | దూరం | పతాకం |
ఒలింపిక్ గేమ్స్ | పారిస్ 2024 | 89.45మీ | రజత పతకం (Silver Medal) |
ఆసియా క్రీడలు | హాంగ్జౌ 2023 | 88.88మీ | బంగారు పతకం |
డైమండ్ లీగ్ | స్టాక్‌హోమ్ 2022 | 89.94మీ | రజత పతకం (Silver Medal) |
కామన్వెల్త్ గేమ్స్ | గోల్డ్ కోస్ట్ 2018 | 86.47మీ | బంగారు పతకం |
ప్రపంచ ఛాంపియన్షిప్ | ఒరెగాన్ 2022 | 88.39మీ | రజత పతకం (Silver Medal) |
ఆసియా ఛాంపియన్‌షిప్‌లు | భువనేశ్వర్ 2017 | 85.23మీ | బంగారు పతకం |
ప్రపంచ Under 20 ఛాంపియన్‌షిప్‌లు | Bydgoszcz 2016 | 86.48మీ | బంగారు పతకం |
ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్స్ | హో చి-మిన్ 2016 | 77.60మీ | రజత పతకం (Silver Medal) |
దక్షిణాసియా క్రీడలు | గౌహతి 2016 | 82.23మీ | బంగారు పతకం |
- 2016: పోలాండ్ అండర్-20 వరల్డ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం
- ఈ పోటీలోనే 86.48 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
- 2018: ఆసియన్ గేమ్స్ లో బంగారు పతకం
- 2020: టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం.
- 2022: ఓరెగన్ వరల్డ్ అథ్లెటిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన మొదటి భారతీయ క్రీడాకారుడు.
- 2022: స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో 89.94 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డు సృష్టించాడు.
- 2023 బుడాపెస్ట్ లో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్ లో బంగారు పథకం
- 2024 పారిస్ ఒలింపిక్స్ లో ఇప్పుడు గాయం కారణంగా సిల్వర్ మెడల్
- నీరజ్ రజత పతకం సాధించడం భారత్‌కు గర్వకారణం. అతని ప్రయాణం ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. పట్టుదల, అభిరుచి ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు.