దేశంలో మళ్ళీ నిపా వైరస్ పేరు వినబడుతుంది, కేరళలో నిఫా వైరస్ మళ్ళీ కలకలం రేపుతోంది. తాజా సమాచారం ప్రకారం, 24 ఏళ్ల యువకుడు నిఫా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.

నిర్ధారణ
మలపురంలో మరణించిన యువకుడి నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా, పరీక్షల్లో నిఫా పాజిటివ్‌గా తేలింది.
లాక్డౌన్ నిర్ణయం
పరిస్థితి మరింత కట్టడి చేయడానికి కేరళ ప్రభుత్వం మలపురం జిల్లాలో లాక్డౌన్ విధించింది. ఈ యువకుడు 175 మందికి సన్నిహితంగా కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. అందులో 26 మందికి నిఫా లక్షణాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
తక్షణ చర్యలు
వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తిరువల్లి పంచాయతీ పరిధిలోని నాలుగు వార్డుల్లో థియేటర్లు, విద్యా సంస్థలు తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. గబ్బిలాలు, మరియు ఇతర జంతువులతో జాగ్రత్తగా ఉండాలని, శుభ్రతను కాపాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాధి సూచనలు
నిఫా వైరస్ సోకినప్పుడు జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్ర స్థాయిలో వైరస్ సోకితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీనికి ప్రత్యేకమైన వైద్యం లేకపోవడంతో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి – గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వలన పెరుగుతున్న మరణాలు
1 thought on “కేరళలో నిఫా వైరస్ కలకలం,లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం | Nipah Virus Outbreak in Kerala”