పాలకుర్తిలో పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఖాళీ చేయించిన అధికారులు | Officials Evicting the Poor from Double Bedroom Houses

WhatsApp Group Join Now

నిరుపేదల కన్నీళ్లు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నుంచి ఖాళీ చేయిస్తున్న అధికారులు

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు (జే) గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలపై తీవ్ర దాడి జరిగింది. రెవెన్యూ, పోలీస్ అధికారులు వచ్చి అకస్మాత్తుగా వీరిని ఇండ్ల నుంచి ఖాళీ చేయించి, తాళం వేసారు. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆవేదనతో ఆత్మహత్యాయత్నం

తమ ఇళ్లను లాగివేసుకుంటున్నారనే ఆవేదనతో కొందరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసారు కానీ గ్రామస్థులు వెంటనే స్పందించి, ఈ దారుణాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

పట్టాలు ఇవ్వకపోవడంపై లబ్ధిదారుల ఆవేదన

గత సంవత్సరం గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ, ఇప్పటివరకు వారికి పట్టాలు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. “ఇండ్లు మాకే అని చెప్పినా, పట్టాలు ఇవ్వకుండా ఇలా ఖాళీ చేయడం ఎంత వేరే” అంటూ లబ్ధిదారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఓటు వేసి గెలిపిస్తే, ఈ పరిస్థితా?

“ఓటు వేసి మా ఎమ్మెల్యే యశశ్విని రెడ్డిని గెలిపిస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు” అని బాధపడుతున్నారు బాధిత కుటుంబాలు. “ఇప్పుడు మా కష్టాన్ని అర్థం చేసుకోని ఎవరూ లేరు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడ్డ అధికారులు

ఇళ్లలో నివసిస్తున్న నిరుపేదల కుటుంబాలు అధికారులు అకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడి, వారి సామాన్లను బయటకు తీసేయడం చూసి దిగ్బ్రాంతికి గురయ్యారు. “మేము ఎక్కడికి వెళ్తామో అర్థం కావట్లేదు” అంటూ తీవ్ర కంగారు పడుతున్నారు.

ఎమ్మెల్యే సత్వరమే స్పందించాలని గ్రామస్థుల డిమాండ్

ఈ దుర్ఘటనతో గ్రామస్థులు ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి సత్వరమే స్పందించి, లబ్ధిదారులకు న్యాయం చేయాలని, వారి భద్రతకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. “ఇప్పటికైనా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు పట్టాలు ఇవ్వాలి” అంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి – ఠాగూర్ సినిమాలో లెక్క మోసం చేసికోటి రూపాయలు కొట్టేసిన రెయిన్ బో హాస్పిటల్

వీడియో

Webstory

Leave a Comment