కాకినాడలో కలకలం రేపిన ఘటన
కాకినాడ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి ఘటనతో కాకినాడలో కలకలం రేగింది. రంగరాయ మెడికల్ కాలేజీ వైస్ చైర్మన్, ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై నానాజీ దాడి చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. జనసేన కార్యకర్తలతో కలిసి నానాజీ, ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావును అసభ్య పదజాలంతో దూషించారు.

అనుమతి వివాదం – దాడికి దారి
ఈ ఘటనకు ముందు నానాజీ, కాలేజీ గ్రౌండ్‌లో వాలీబాల్ ఆడేందుకు అనుమతి కోరగా, ఉన్నతాధికారుల అనుమతిని తీసుకోవాలని ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు చెప్పడం నచ్చలేదు. ఈ సందర్భంలో నానాజీ రెచ్చిపోయి దాడికి దిగారు. ప్రొఫెసర్ ముఖంపై దాడి చేసినప్పటికి, ఆయన అనుచరులు కూడా ప్రొఫెసర్‌ను దాడి చేయడం ఆందోళన కలిగించింది.
ఫిర్యాదులు, అధికారుల జోక్యం
ఈ ఘటనపై రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎమ్యెల్యే నానాజీ, దళిత ప్రొఫెసర్‌పై దాడి చేయడమే కాకుండా, అసభ్య పదజాలంతో తల్లిని దూషించారన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనలో, ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత సంఘాల ఆగ్రహం – పరిష్కారం ప్రయత్నాలు
ఈ దాడి మీద కోనసీమలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ అధికారులు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రంగంలోకి దిగారు. కాలేజీ యాజమాన్యంతో చర్చలు జరిపి, పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి – అంబేద్కర్ ఫ్లెక్సీ చించేసిన రఘు రామ కృష్ణ రాజు
వీడియో
రంగరాయ మెడికల్ కాలేజ్ వైస్ ఛైర్మన్ తో దురుసు ప్రవర్తించిన కాకినాడ(R) ఎమ్మెల్యే పంతం నానాజీ.
వాలీబాల్ ఆడేందుకు యువకులకు అనుమతి లేదని యువకులను కాలేజ్ సిబ్బంది అడ్డుకోవడంతో MLAకు ఫిర్యాదు చేసిన యువకులు.
నానాజీ ఆగ్రహానికి గురై బూతులు తిట్టడంతో పాటు దుర్భాషలాడారు. pic.twitter.com/bnrhVQIVxr
— greatandhra (@greatandhranews) September 21, 2024