రేషన్ బియ్యం షిప్ సీజ్ పై రాజకీయ దుమారం | Political Storm Over Ration Rice Ship Seizure

WhatsApp Group Join Now

ఆంధ్రప్రదేశ్‌లో స్టెల్లా షిప్ సీజ్ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కాకినాడ పోర్ట్‌లో 1,064 టన్నుల రేషన్ బియ్యంతో ఉన్న ఈ షిప్‌ను సీజ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు పరస్పర విమర్శలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది.

అసలు వివాదం ఏమిటి?

కాకినాడ పోర్ట్‌లో స్టెల్లా అనే షిప్‌లో ఉన్న రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అయితే, విపక్ష నేతలు మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వైసీపీ నేతలు మరో షిప్ ‘కెన్ స్టార్‘పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.

ఈ కెన్ స్టార్ షిప్ లో మంత్రి పయ్యావుల కేశవ్ గారి వియ్యంకుడికి చెందిన బియ్యం ఉన్నాయి. పయ్యావుల కేశవ్ గురించి మాట్లాడుతూ ” మీ వియ్యకుండు బియ్యం అయితే వదిలేస్తారా?” అని వారు ప్రశ్నించారు

మంత్రి గారి సమాధానం
 

ఈ ఆరోపణలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “మూడు తరాలుగా మా వియ్యంకుడు బియ్యం వ్యాపారం చేస్తున్నారు, కానీ కెన్ స్టార్ షిప్ లో దొరికింది రేషన్ బియ్యం కాదు, వేరే బోయిల్డ్ రైస్” అని స్పష్టంచేశారు.

కలెక్టర్ వివరణ

కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, “స్టెల్లా షిప్‌లో పిడిఎస్ రైస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ కెన్ స్టార్ షిప్‌లో బాయిల్డ్ రైస్ మాత్రమే ఉందని” వివరణ ఇచ్చారు. అయినా కూడా రాజకీయ ఆరోపణలు తగ్గడం లేదు.

వివాదం ఎక్కడికి దారితీస్తుందో?

ప్రజలు మాత్రం అసలు నిజం ఏమిటి అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరు ఈ రైస్ వివాదం గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియజేయండి!

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ పేరుతో పేదలకు ఉచిత భోజనం అందిచబోతున్న అభిమానులు

ప్రాణహాని తలపెట్టేలా జనసేన కార్యకర్తల పోస్టులు

వీడియో

Leave a Comment