తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అత్యవసర విద్యుత్ సేవలను వేగంగా అందించేందుకు దేశంలోనే తొలిసారి ప్రత్యేక విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ వాహనాలు అంబులెన్స్ తరహాలో ఉండి విద్యుత్ సమస్యలను సమర్థంగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటాయి.
57 సబ్ డివిజన్ లకు వాహనాల కేటాయింపు
హైదరాబాద్ GHMC పరిధిలోని 57 సబ్ డివిజన్ లకు 57 వాహనాలను కేటాయిస్తూ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ వాహనాలను ప్రారంభించారు.
24 గంటల విద్యుత్ సేవలు
ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్ మెన్లు ఉంటారు. అవసరమైన మెటీరియల్ తో ఈ బృందం 24 గంటల పాటు విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటుంది.
ఈ వాహనంలో నాలుగు కూర్చోవడానికి సీటింగ్, ట్రాన్స్ఫార్మర్ ని పెట్టుకోవడానికి మరియు ఇతర ఎలక్ట్రిక్ టూల్స్, వైర్లను పెట్టుకోవడానికి వెనుక స్పేస్ ఉంది.
ఇవి కూడా చదవండి
ఒంగోలులో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్
మూఢనమ్మకం పేరుతో ఊరంతా ఖాళీ చేసిన గ్రామస్థులు
వీడియో
తెలంగాణలో విద్యుత్ సేవల కోసం ప్రత్యేక విద్యుత్ వాహనాలు…!
ప్రజలకు విద్యుత్ సేవలు అందిచేందుకు దేశంలోనే తొలిసారి అంబులెన్స్ తరహాలోనే ప్రత్యేక విద్యుత్ వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం GHMC పరిధిలోని 57 సబ్ డివిజన్ లకు 57 వాహనాలను కేటాయిస్తూ డా. బి.ఆర్ అంబేద్కర్… pic.twitter.com/G63nvoXfLe
— BIG TV Breaking News (@bigtvtelugu) October 21, 2024
2 thoughts on “దేశంలోనే తొలిసారి కొత్త తరహా విద్యుత్ వాహనాలును విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం | Special Electric Vehicles for Power Services in Telangana”