కోల్‌కతాలో హై టెన్షన్, విద్యార్ధులపై కాల్పులు | Student Rally Turns Violent in Kolkata

WhatsApp Group Join Now

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా రణరంగంగా  మారింది. కోల్‌కతా మహిళా డాక్టర్ అత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థులు “నాబన్న అభిజన్” అనే ర్యాలీ ని మంగళవారం జరిపారు. ఈ ర్యాలీ సందర్భంగా సచివాలయాన్ని ముట్టడి వేయాలని విద్యార్థులు వేలాదిగా కదిలారు.

పోలీసులు బారికేడ్లు వేసిన విద్యార్థులు వాటిని తీసివేసి సచివాలయాన్ని ముట్టడి వేయబోతుంటే వాళ్ళను అడ్డుకోవడానికి పోలీసులు ఏమి చేయలేక వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ మరియు లాఠీ ఛార్జీలను ప్రయోగించారు.దీనితో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. హౌరా బ్రిడ్జి  పైకి ఎక్కి నినాదాలు చేసారు.

High Tension in Kolkata Doctors Protest in Kolkata
Kolkata Turns Chaotic: Police Hunt for Protesters

తర్వాత సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద సెక్యూరిటీ పెంచారు. సెక్రటేరియట్ చుట్టూ పోలీసులు ఉన్నారు. అటు వైపు వెళ్లే రోడ్లను కూడా బ్లాక్ చేసారు.

ఈ విద్యార్థి నిరసన బీజేపీ రాజకీయ కుట్ర అని తృణమూల్ కాంగ్రెస్ నాయకులూ అంటున్నారు. వారిలో ఉన్నవారు స్టూడెంట్స్ కాదు అని వారు బీజేపీ గూండాలు అని చెప్పారు. నిరసన పేరుతో కోల్‌కతా నగరంలో హింసకు పూనుకున్నారని అన్నారు.

పోలీసులు 94 మందిని అరెస్ట్ చేసారు ఇంకా అనేకులకు అరెస్ట్ చేయడానికి నిరసన వీడియోలు పరిశీలిస్తున్నారు.

బీజేపీ రేపు కోల్‌కతా లో బంద్ చేయడానికి పిలుపునిచ్చారు.

వీడియో

Webstory

Leave a Comment