రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కిన పోలీసుల భార్యలు | Police Families Protest in Siricilla

Police Wives Protest in Rajanna Sircilla

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల, అక్టోబర్ 24 (తాజావార్త): అంబేద్కర్ చౌరస్తా వద్ద 17వ బెటాలియన్ పోలీసుల భార్యలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. తమ భర్తలకు ఆపాదించిన పనులు కారణంగా, కుటుంబాలను దూరం చేస్తోన్న విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “మా భర్తలు పోలీసులా.. కూలీలా?” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తమ భర్తలు డ్యూటీకి సంబంధం లేకుండా కూలీ పనులు, చెత్త ఏరే పనులు చేయించబడుతున్నారని, పోలీస్ విధానం మారాలని డిమాండ్ చేశారు డిచ్ పల్లిలో … Read more

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు కరెంట్ బిల్లుల షాక్ | Current Bill Shock for Beneficiaries of Double Bedroom Houses

Current Bill Shock for Beneficiaries of Double Bedroom Houses

మహబూబ్ నగర్ అక్టోబర్ 23: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ పురపాలక సంఘ పరిధిలోని సిద్ధాయిపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు భారీ కరెంట్ బిల్లులు రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 70 మందికి రూ.10,000ల కంటే ఎక్కువ బిల్లులు రాగా, కొందరికీ రూ.20,000 దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. విద్యుత్ శాఖ తీరుపై ప్రజల ఆగ్రహం లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించినప్పటి నుంచి విద్యుత్ … Read more

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ముడా స్కామ్ ఆరోపణలు | Karnataka CM Siddaramaiah Faces Muda Scam Allegations

Karnataka CM Siddaramaiah Faces Muda Scam Allegations

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా స్కామ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) పరిధిలో జరిగిన ఈ స్కామ్, ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముడా స్కామ్‌లో సుమారు 32 ఎకరాల భూమి, కర్ణాటక ముఖ్యమంత్రి కుటుంబానికి చెందినవారి పేరుతో వివాదాస్పదమైంది. ఇంతకీ ఈ ముడా స్కామ్ ఏమిటి? ముడా అనేది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఇందులో భాగంగా, సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన … Read more

హైడ్రా వేధింపులు తాళలేక కూకట్‌పల్లి మహిళ ఆత్మహత్య | Kukatpally Woman Committed Suicide Due to Hydra Harassments

Kukatpally Woman Committed Suicide Due to Hydra Harassments

కూకట్‌పల్లి లో విషాదం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. యాదవ బస్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మహిళ హైడ్రా కూల్చివేత‌ల వేధింపులతో మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని శోక‌సంద్రంలో ముంచెత్తింది. బుచ్చమ్మకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు, వారికి కట్నంగా మూడు ఇండ్లు రాసిచ్చింది. కానీ హైడ్రా అధికారులు ఈ ఇండ్లు ఖాళీ చేయాలంటూ ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. దీనికి భయపడి, తన జీవిత … Read more

కేరళలో నిఫా వైరస్ కలకలం,లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం | Nipah Virus Outbreak in Kerala

Nipah Virus Outbreak in Kerala, Govt Imposed Lockdown

దేశంలో మళ్ళీ నిపా వైరస్ పేరు వినబడుతుంది, కేరళలో నిఫా వైరస్ మళ్ళీ కలకలం రేపుతోంది. తాజా సమాచారం ప్రకారం, 24 ఏళ్ల యువకుడు నిఫా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. నిర్ధారణ మలపురంలో మరణించిన యువకుడి నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా, పరీక్షల్లో నిఫా పాజిటివ్‌గా తేలింది. లాక్‌డౌన్ నిర్ణయం పరిస్థితి మరింత కట్టడి చేయడానికి కేరళ ప్రభుత్వం మలపురం జిల్లాలో లాక్‌డౌన్ విధించింది. ఈ యువకుడు 175 మందికి సన్నిహితంగా … Read more

నందిగం సురేష్ అక్రమ అరెస్ట్ విషయమై ఫైర్ అయిన జగన్ | YS Jagan Strong Comments on Nandigam Suresh Arrest

YS Jagan's Strong Comments on Nandigam Suresh's Arrest

ఏపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన స్నేహితుడిని పరామర్శించారు. నందిగం సురేశ్‌ను అక్టోబర్ 2021లో టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు అరెస్టు చేసి, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జగన్ మాట్లాడుతూ, “నందిగం సురేష్‌పై జరిగిన అరెస్టు అన్యాయమని, ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని” అన్నారు. “ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు తగవని, ప్రజల కోసం పనిచేసే నాయకులను … Read more

ప్రకాశం బ్యారేజీను ఢీకొట్టిన పడవలపై రేగిన రాజకీయ దుమారం | Prakasam Barrage Boat Accident

Prakasam Barrage Boat Accident

ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగిన బోట్ల ఢీకొట్టిన ప్రమాదం తీవ్ర రాజకీయ సంచలనం సృష్టించింది. ఇటీవల కృష్ణా నదిలో ఐదు పెద్ద బోట్లు ప్రవాహంలో కొట్టుకొని ప్రకాశం బ్యారేజ్ గేట్లకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రకాశం బ్యారేజీ 3 గేట్లకు నష్టం వాటిల్లింది. వైఎస్ఆర్‌సీపీ రంగులతో కూడిన ఈ పడవలు, పార్టీ నేతల అనుచరులకు చెందినవని ఆరోపణలు వినిపించాయి. పోలీసులు ఈ ఘటనలో వైసీపీ అనుచరులుగా చెబుతున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వైసీపీ నేతలు ఈ ఘటనకు … Read more

విజయవాడ వరద బాధితులకు సాయం చేసిన సోను సూద్ | Sonu Sood Helps Flood Victims in Vijayawada

Sonu Sood Helps Flood Victims in Vijayawada

బాలీవుడ్ నటుడు మరియు మానవతావాది సోనూసూద్ ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయం అందించారు. వరదల వల్ల ఇళ్లను, జీవనాధారాలను కోల్పోయిన బాధితులకు ఆహారం, నీరు, మెడికల్ కిట్లు, బకెట్లు, దుప్పట్లు,చాపలు అందించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు తన టీమ్ ఎంతో కష్టపడి పనిచేస్తోందని సోనూసూద్ తెలిపారు. అతను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు మరియు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు. వరద బాధితుల కోసం ఆయన చేస్తున్న ఈ సేవలు మరోసారి ప్రజల్లో ఆయన్ను … Read more

మహబూబ్ నగర్ లో పేదల ఇళ్లను కూల్చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం | Revanth Reddy Government Demolished the Houses of the Poor in Mahabubnagar

Revanth Reddy Government Demolished the Houses of the Poor in Mahabubnagar

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని “హైడ్రా” పేరుతో కొనసాగుతున్న కూల్చివేతలపై తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఇటీవల, హైడ్రా బృందం మహబూబ్‌నగర్‌లోని క్రిస్టియన్ పల్లి ఆదర్శ్ నగర్ లో కూల్చివేతలను నిర్వహించి పేద నివాసితుల ఇళ్లను కూల్చివేసింది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తెల్లవారుజామున ఈ చర్య జరగడంతో నివాసితులు తమ వస్తువులను తీసుకొనే అవకాశం లేకుండా పోయింది. దాదాపు 75 గృహాలు కూల్చివేయబడ్డాయి, వీటిలో 25 వికలాంగులకు చెందినవి, ఈ బలహీన కుటుంబాలు … Read more

పారిస్ పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అవనీ లేఖరా | Avani Lekhara Wins Gold for India in Paris Paralympics

Avani Lekhara Wins Gold for India in Paris Paralympics

Paris Paralympics 2024 22 ఏళ్ల భారత షూటర్ అవనీ లేఖరా పారిస్ పారాలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (SH1) ఈవెంట్‌లో స్వర్ణం గెలిచింది. ఆమె 249.7 స్కోర్‌తో, గత టోక్యో పారాలింపిక్స్‌లో నెలకొల్పిన తన సొంత రికార్డును బద్దలు కొట్టింది. 11 ఏళ్ల వయస్సులో కారు ప్రమాదంలో పక్షవాతానికి గురైన లేఖరా వీల్ చైర్‌లో ఉన్నా, తన లక్ష్యాలను సాధించడంలో ఏదీ ఆమెను అడ్డుకోలేకపోయింది. ఆమె విజయం ప్రేరణగా నిలుస్తూ, భారత యువ … Read more