అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | CM Revanth Reddy Sensational Comments on Allu Arjun

CM Revanth Reddy Sensational Comments on Allu Arjun

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న ఆయన, ఈ అంశంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ మరణించిందని, ఆమె కొడుకు జీవితంపై పోరాటం చేస్తున్నాడని ప్రస్తావిస్తూ, అల్లు అర్జున్ చట్టపరమైన చర్యలపై తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. అల్లు అర్జున్ పై ఘాటైన వ్యాఖ్యలు “అల్లు అర్జున్ ఏం భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పోరాడి దేశాన్ని గెలిపించాడా?” అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర … Read more

రైతుల భూముల విషయంలో ప్రభుత్వం తీరుపై ఈటెల రాజేందర్ ఆగ్రహం | Etela Rajender Slams Government Over Farmers Land Issues

Etela Rajender Slams Government Over Farmers' Land Issues

కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూముల విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 50 లక్షల రూపాయల విలువైన భూములను 10 లక్షల రూపాయల కింద తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు జనసామాన్యంలో ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ తీరుపై ఈటెల విమర్శలు “ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం ఒకటైతే, బడా కంపెనీలకు అప్పజెప్పడం వేరే సంగతి,” అంటూ ఈటెల రాజేందర్ ఆరోపించారు. భూముల విషయంలో రైతుల … Read more

మూసీ పరివాహ ప్రాంతాల్లో బీజేపీ నేతల బస్తీ నిద్ర కార్యక్రమం| BJP Leaders Basti Nidra

BJP Leaders Basti Nidra

మూసీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఇళ్లకు భరోసా ఇవ్వడం లక్ష్యంగా బీజేపీ చేపట్టిన “మూసీ బస్తీ నిద్ర” కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తులసిరామ్ నగర్ బస్తీలో రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకత్వంలోని 20 మంది ప్రముఖులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాల్గొన్నారు. స్థానికులతో కిషన్ రెడ్డి భేటీ కిషన్ రెడ్డి బస్తీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు … Read more

మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం అంటున్న కేసీఆర్ | KCR Statement We Will Return to Power

KCR Statement We Will Return to Power

ఎర్రవల్లిలో పాలకుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి జిల్లాలో ప్రజలు మళ్లీ మన ప్రభుత్వాన్ని అధికారం లోకి తీసుకురావాలని భావిస్తున్నారు” అని పేర్కొన్నారు. ఆయన ధీమా వ్యక్తం చేస్తూ, వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 100 శాతం అధికారంలోకి వస్తుందని చెప్పారు. ప్రజలు ఈ ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు కేసీఆర్ -“ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 11 నెలలు అవుతోంది, కానీ … Read more

పోలీసుల దురుసు ప్రవర్తన వలన ఆసుపత్రి పాలైన కౌశిక్ రెడ్డి | MLA Padi Kaushik Reddy Arrest

MLA Padi Kaushik Reddy Arrest

హుజురాబాద్: పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత హక్కుల కోసం నిర్వహించిన నిరసనలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో అతను స్పృహ తప్పి ఆసుపత్రిలో చేరారు. కౌశిక్ రెడ్డిని బలవంతంగా వాహనంలోకి కుక్కి తీసుకెళ్లినప్పుడు అతడు తీవ్ర ఒత్తిడికి గురై కాసేపు ఊపిరాడక స్తంభించి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. దళితుల కోసం పోరాటం దళిత బంధు అమలులో జాప్యం ఏంటని ప్రశ్నిస్తే, పోలీసులు ఈ స్థాయి నిరంకుశ చర్యలకు దిగారా? అని … Read more

పోలీసుల దురుసు ప్రవర్తనతో వ్యక్తి ఆత్మహత్య | Man Commits Suicide Due to Police Misbehaviour

Man Commits Suicide Due to Police Misbehaviour

మెదక్:  మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామంలో తలారి కిషన్ అనే వ్యక్తి తన ఫోన్‌ పోయిందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం, అక్కడ దురుసుగా ప్రవర్తించిన పోలీసులు, చివరికి ఆత్మహత్యకు దారితీసింది. ఈ విషాదం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కిషన్‌పై దురుసు ప్రవర్తన మంగళవారం రాత్రి తన ఫోన్ పోయినదంటూ అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన కిషన్, పోలీసుల దృష్టిలో తమ బాధ్యతను చెప్పుకునే స్థాయిలో కనిపించలేదు. … Read more

హైటెక్‌సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో దారుణం |  Doctor Dies at Medicover Over Payment Issue

Doctor Dies at Medicover Over Payment Issue

హైదరాబాద్ (తాజావార్త): హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో అనారోగ్యంతో చికిత్స కోసం చేరిన జూనియర్ డాక్టర్ నాగప్రియను ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చూపించి మరణానికి కారణమయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఇప్పటి వరకు రూ. 3 లక్షలకు పైగా ఖర్చు చేసినా, ఇంకా డబ్బులు చెల్లించకుంటే మృతదేహం ఇవ్వబోమంటూ ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు కుటుంబసభ్యుల కథనం ప్రకారం, నిన్న అర్ధరాత్రి ఆస్పత్రి సిబ్బంది నుంచి మూడు … Read more

ఎస్ఐ వేధింపులకు చిరు వ్యాపారి ఆత్మహత్యాయత్నం | Small Businessman Attempted Suicide Due to SI Harassment

Small Businessman Attempted Suicide Due to SI Harassment

వరంగల్ నవంబర్ 1 (తాజావార్త): వరంగల్ మట్టేవాడ ప్రాంతంలోని ఆటోనగర్‌లో చిరు వ్యాపారి శ్రీధర్ ఆత్మహత్యకు యత్నించగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహించే శ్రీధర్ మీద పోలీసులు వేధింపులు పెంచుతున్నారని ఆరోపిస్తూ, స్టేషన్‌లోనే ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేశారు. పోలీసుల వేధింపులపై శ్రీధర్ ఆవేదన వివరాల్లోకి వెళితే, ఎస్ఐ విఠల్ నెల రోజులుగా తనను క్రమంగా వేధిస్తున్నాడని, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నాడని శ్రీధర్ ఆరోపించారు. స్టేషన్‌లో పెట్రోల్ పోసుకుని ప్రాణాలను … Read more

ఆత్మహత్యకు యత్నించిన బెటాలియన్ కానిస్టేబుల్‌కు కేటీఆర్ భరోసా | Battalion Constable Commit Suicide

KTR Reassured Battalion Constable Who Tried to Commit Suicide

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీజీఎస్పీ థర్డ్ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ టైగర్ నాగేశ్వరరావు తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. ఫోన్‌ గుంజుకొని తన విషయాలు బయట పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో నాగేశ్వరరావు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్‌కు కేటీఆర్ భరోసా కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేయడంపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన్ను ఫోన్‌లో సంప్రదించి ధైర్యం కల్పించారు. ప్రభుత్వం తనపై కక్షగట్టినట్లు … Read more

రైతు బీమా పథకం ఉందా?  | Telangana Farmer Insurance scheme Exist?

Telangana Farmer Insurance scheme Exist?

తెలంగాణ అక్టోబర్ 28 (తాజావార్త): రైతు కుటుంబాల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడానికి రూపొందించిన ‘రైతు బీమా’ పథకంపై బాధిత కుటుంబాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతు మరణించిన వెంటనే కుటుంబ సభ్యులకు సాయం అందేలా ఏర్పాటు చేసిన ఈ పథకం, వాస్తవానికి వారం రోజుల్లో అందాల్సిన ఆర్థిక సాయాన్ని నెలల తరబడి నిరీక్షింపజేస్తోంది. ప్రభుత్వ లక్ష్యం – నెలలుగా కుటుంబాల నిరీక్షణ రైతు బీమా పథకం కింద రైతు మరణించిన తర్వాత వారం రోజుల్లో … Read more