తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం | Tamil Nadu Terrible Train Accident

WhatsApp Group Join Now

శుక్రవారం రాత్రి 8:30 గంటలకు, చెన్నై సమీపంలోని తిరువళ్లూర్ జిల్లాలో (కవార్‌పట్ట దగర) భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు, వేగంగా ప్రయాణిస్తూ, నిలిపివుంచిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 బోగీలు పట్టాలు తప్పి, 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. నలుగురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ప్రమాదంలో ఓ పవర్ కార్‌కు మంటలు అంటుకున్నాయి. 1,360 మంది ప్రయాణికులతో మైసూరు నుండి దర్భంగా వైపు వెళ్తున్న ఈ రైలు, లూప్ లైన్‌లోకి ప్రవేశించి గూడ్స్ రైలును ఢీకొట్టింది.

సహాయక చర్యలు

ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి తర్వాత stranded ప్రయాణికులను చెన్నై MTC బస్సుల ద్వారా డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు తరలించారు. ఉదయం ప్రత్యేక రైలు ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపించారు. వారికోసం ఆహారం మరియు నీరు అందించారు.

రైల్వే అధికారులు స్పందన

దురదృష్టకర ఘటనపై సదరన్ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.ఎన్. సింగ్ మాట్లాడుతూ, “రైలు ఆంధ్రప్రదేశ్ వైపుగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లూప్ లైన్‌లో నిలిపివుంచిన గూడ్స్ రైలు వైపు వెళ్తోంది. కానీ సిగ్నల్ ఉన్నప్పటికీ, భాగమతి ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్‌లోకి వెళ్లిపోయి గూడ్స్ రైలును వెనుక నుండి ఢీకొట్టింది.” అని తెలిపారు.

రైల్వే భద్రతా కమిషనర్ అనంత్ మధుకర్ చౌధరి ప్రమాద స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. సంఘటన స్థలంలో పరిశీలన కోసం స్నిఫర్ డాగ్స్‌ను కూడా ఉపయోగించారు.

ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రకటన

ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ప్రభుత్వం వేగంగా సహాయక చర్యలు చేపడుతోంది. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించాం. మరింత సహాయం మరియు ప్రయాణికులకు భోజనం, వసతులు అందించేందుకు ప్రత్యేక బృందం పని చేస్తోంది,” అని తెలిపారు.

ట్రైన్ సేవలు రద్దు

ఈ ప్రమాదం కారణంగా 18 రైలు సేవలు అక్టోబర్ 12న రద్దు చేయబడ్డాయి. రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలపై ఉన్నతస్థాయి విచారణను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

ఐసీఐసీఐ బ్యాంక్ 100 కోట్ల స్కామ్‌పై సీఐడీ దర్యాప్తు

కొండా సురేఖపై 100 కోట్ల పరువు నష్టం కేసు వేసిన నాగార్జున

వీడియో

Tamil Nadu Train Accident

1 thought on “తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం | Tamil Nadu Terrible Train Accident”

Leave a Comment