శ్రీకాకుళం, అక్టోబర్ 26 (తాజావార్త): పలాస నియోజకవర్గం తాళభద్ర రైల్వే గేటు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. రాత్రి ఒంటిగంట సమయంలో టిడిపి నేతలు ఓ బాలిక, ఆమె తల్లిపై దాడికి పాల్పడ్డారు. ఉత్సవాల్లో డాన్స్ చేయనని చెప్పినందుకు తెలుగుదేశం యువత అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు, తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎం. సుదిష్ణను తీవ్రంగా కొట్టాడు. ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తల్లి నాగమణిపై కూడా దాడి జరిగింది.
పేదరికంలో సతమతమవుతున్న కుటుంబంపై దాడి
నందన్న ఉత్సవాల తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా కిక్కర ఢిల్లీ రావు, బైనపల్లి వినయ్, బైనపల్లి ప్రణయ్, రేయ్య చరణ్ లు అర్ధరాత్రి దాడి చేశారు. ఈ దాడి ఘటనలో బాధితులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై ఆగ్రహం
కానీ, ఎమ్మెల్యే గౌత శిరీష ఒత్తిడితో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్యే పిఏ శ్రవణ్ స్వయంగా వచ్చి కేసు నమోదు చేయవద్దని ఆదేశించారు. ఈ పరిణామాలపై బాధితులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
ప్రాణహాని ఉందని బాధితుల ఆవేదన
స్థానిక టిడిపి నేతల నుంచి ప్రాణహాని ఉందని బాధితులు వాపోతున్నారు. ఉదయం నుంచి పోలీస్ స్టేషన్ వద్ద ఎదురుచూస్తున్న బాధితులు, తమకు న్యాయం జరిగే రోజు ఎప్పుడో అనే ఆందోళనలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ధోని ఈ సంవత్సరం ఐపీఎల్ ఆడుతున్నాడా?
మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అరెస్ట్
వీడియో
తల్లి, కుమార్తెలపై టిడిపి నేతలు దాడి.
పలాస నియోజకవర్గం తాళ భద్ర రైల్వే గేటు వద్ద అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో చోటుచేసుకున్న ఘటన
ఉత్సవాల్లో డాన్స్ చేయను అన్నందుకు బాలికను తీవ్రంగా కొట్టిన పలాస మండలం తెలుగు యువత అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు
తొమ్మిదో తరగతి చదువుతున్న ఎం. సుదిష్ణపై… pic.twitter.com/DQwuVlDcii
— Rahul (@2024YCP) October 26, 2024
BREAKING NEWS
శ్రీకాకుళం లో తల్లి, కుమార్తెలపై టిడిపి నేతలు దాడి.
పలాస నియోజకవర్గం ఉత్సవాల్లో డాన్స్ చేయను అన్నందుకు.
బాలికను తీవ్రంగా కొట్టిన పలాస మండలం తెలుగు యువత అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు. pic.twitter.com/Fw7u0Hidfc
— YSRCP Brigade (@YSRCPBrigade) October 26, 2024
1 thought on “తల్లీ కూతుళ్లపై టీడీపీ నేతల దాడి | TDP Leaders Attack Mother and Daughter”