కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ, జనసేన నేతల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తీవ్ర దుమారం రేపింది. వినాయక చవితి సందర్భంగా మచిలీపట్నం పరాసుపేటలో కూటమి పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనసేన నాయకుల పేర్లు లేకపోవడం వల్ల వివాదం తలెత్తింది. జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావులు తమ పేర్లు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ బ్యానర్‌ను చించివేశారు.

ఈ ఘటనకు ప్రతిస్పందనగా టీడీపీ నేతలు నాని ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఇంట్లోని LED టీవీ, ఇతర సామానులను ధ్వంసం చేయడంతో పాటు నానికి తీవ్ర గాయాలు అయ్యాయి. నానిపై దాడి తర్వాత ఇరు పార్టీల నేతలు సెటిల్మెంట్ చేసుకున్నారు. గొడవ సర్దుమణిగింది అనుకున్న సమయంలో, నిన్న ఉదయం టీడీపీ నాయకులు మరోసారి నాని ఇంటికి వెళ్లి మరింత దాడికి దిగారు. ఈ సమయంలో నాని ఇంట్లో ఉన్న శాయన శ్రీనివాసరావుపై కూడా తీవ్ర దాడి జరిగింది.
దాడి అనంతరం, టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్ళు పట్టించి మరీ క్షమాపణలు చెప్పించుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. మచిలీపట్నంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వీడియో
పొత్తులో ధర్మం, టీడీపి నేతలు కాళ్ళు, చేతులు ఏదీ దొరికితే అది పట్టుకోవాలి, తప్పులేదు అంటున్న జనసేన నేత.#TDP x #JSP #AndhraPradesh #UANow pic.twitter.com/ehTeEJxkt0
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 10, 2024