రాష్టం రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. పాఠశాలలో సిబ్బంది కూరలతో భోజనం చేస్తుండగా, విద్యార్థులకు పురుగులు పడిన అన్నం, కారం మాత్రమే వడ్డించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది.
పురుగుల అన్నం, కారం భోజనం
విద్యార్థులు చెబుతున్నట్లు, వారికి ఆహారం రూపంలో పురుగులు పడ్డ అన్నం, కారం మాత్రమే పెట్టిస్తున్నారు. దీనిపై విద్యార్థులు ప్రశ్నిస్తే, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా “ఇంటి నుంచి తెచ్చుకోండి” అని సమాధానం ఇస్తున్నారు.
మంచి నీటి కోసం ఇబ్బందులు
తాగడానికి మంచి నీరు అందుబాటులో లేకపోవడం విద్యార్థులకు మరో ప్రధాన సమస్య. నీటి సమస్య కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు.
ఉపాధ్యాయుల దెబ్బలు, అవమానాలు
విద్యార్థులు అందిస్తున్న వివరాల ప్రకారం, ఉపాధ్యాయులు పిల్లలతో అనుచితంగా మాట్లాడడమే కాకుండా, మితిమీరిన శిక్షలు అమలు చేస్తున్నారు. “మిమ్మల్ని 10వ తరగతి ఫెయిల్ చేస్తాం” అని బెదిరిస్తూ, తమ తల్లిదండ్రుల కూడా ఆలా కొట్టారని మరి దయ, జాలి లేకుండా కొడుతున్నారని పిల్లలు వాపోతున్నారు.
“మీరు SC/ST కులపోల్లు, మీ క్లాస్ కి వస్తే వాసన వస్తుంది” అని చిన్నచూపుతో మాట్లాడుతున్నారని విద్యార్థులు బాధపడుతున్నారు. ఒక టీచర్ అయితే పిల్లలను పైప్‌కి నూనె రాసి కొట్టిన ఘటన కూడా చోటుచేసుకున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు.
విద్యార్థుల నిరసన
సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి తమకు జరిగిన ఈ అన్యాయానికి పరిష్కారం చెయ్యాలని కోరుతూ విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేశారు.
సరైన పౌష్టికాహారం, మంచి నీటి వసతి కల్పించాలని పాఠశాల యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
హరీష్ రావు స్పందన
హరీష్ రావు గారి పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించారు. అయన మాట్లాడుతూ ప్రభుత్వం 5-6 నెలల నుండి కాస్మొటిక్ చార్జీలు(పిల్లలు సబ్బులు టూత్ పేస్ట్ కొనుక్కోవడానికి), మెస్ చార్జీలు, కరెంటు బిల్లులు ఇవన్నీ ఇవ్వడం లేదని దీనివలన తెలంగాణాలో ఆందోళన కలిగించే పరిస్థితి ఏర్పడింది అని అన్నారు.

మీరు ముందు విద్యాశాఖ మంత్రిగా చేసి ఉన్నారు, ఇప్పటికైనా ఇవన్నీ పట్టించుకోని పిల్లలకు మంచి భోజనం వసతులు విద్య అందేవిధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
వీడియో
TeluguScribe Exclusive
గురుకుల విద్యార్థుల కండ్లల్లో కారం కొట్టిన సిబ్బంది.
రంగారెడ్డి – శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి, ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారు. మేం అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండని అంటున్నారు.
మంచి… pic.twitter.com/PkP1eazt0V
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2024