ఇండియాలో టెలిగ్రామ్‌పై విచారణ
భారతీయ ప్రభుత్వం టెలిగ్రామ్‌లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు, బెదిరింపులు మరియు జూదం అంశాలను దృష్టిలో ఉంచుకుని విచారణ చేస్తున్నారు. ఈ విచారణని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) మరియు హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆధ్వర్యంలో జరుపుతున్నారు. ఈ విచారణ ఫలితాలపై ఆధారపడి, టెలిగ్రామ్‌ను భారతదేశంలో నిషేధించే అవకాశం కూడా ఉంది.
టెలిగ్రామ్ సమస్యలో పడిన కారణం
టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ 2024 ఆగస్టు 24న ఫ్రాన్స్‌లో అరెస్ట్ చేయబడ్డారు. ఈ అరెస్టు టెలిగ్రామ్ యొక్క నిబంధనలు చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకోవడంలో విఫలమైన కారణంగా జరిగింది. ఇండియాలో జరుగు విచారణ టెలిగ్రామ్ భారతదేశంలోని ఐటీ నిబంధనలను పాటిస్తున్నదా లేదా అని తెలుసుకుంటోంది.

సీఈఓ పావెల్ దురోవ్ అరెస్టు
ఫ్రాన్స్ అధికారులు పావెల్ దురోవ్‌ను పారిస్ సమీపంలోని విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ అరెస్టు మరింత విచారణ భాగంగా కొనసాగుతోంది. అరెస్టు రాజకీయ ప్రేరేపితమైనది కాదని, స్వతంత్ర న్యాయ ప్రక్రియలో భాగమని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పష్టం చేశారు.
టెలిగ్రామ్ APP ప్రత్యామ్నాయం
మీరు టెలిగ్రామ్ గురించి ఆందోళన చెందుతుంటే, సిగ్నల్ ఒక గొప్ప ప్రత్యామ్నాయం. సిగ్నల్ ఆప్ కు సంబంధించిన వివరాలివిగో.

సిగ్నల్ కీలక లక్షణాలు
- మెసేజింగ్: ఉచితంగా టెక్స్ట్‌లు, వాయిస్ సందేశాలు, ఫోటోలు, వీడియోలు, GIFలు, మరియు ఫైల్‌లను పంపించుకోవచ్చు.
- వాయిస్ మరియు వీడియో కాల్స్: సురక్షితమైన, ఎన్‌క్రిప్టెడ్ కాల్స్‌తో మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడొచ్చు. గ్రూప్ కాల్స్‌లో 40 మంది వరకు పాల్గొనవచ్చు.
- క్రాస్-ప్లాట్‌ఫార్మ్: సిగ్నల్ Android, iPhone, iPad, మరియు డెస్క్‌టాప్ అన్నింటిలో పనిచేస్తుంది (ముందుగా మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి).
- ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్: మీరు పంపే ప్రతిదీ సెక్యూర్ మరియు ప్రైవేట్‌గా ఉంటుంది.
వినియోగదారు అనుభవం
సిగ్నల్ వాడడం చాల సులభం, WhatsApp మరియు Facebook Messenger లాంటిదే. గ్రూప్ చాట్స్‌లో 1000 మంది వరకు ఉండవచ్చు, గ్రూప్ కాల్స్‌లో 8 మంది వరకు పాల్గొనవచ్చు.
సిగ్నల్ ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి
- ముందుగా ఫోన్ లోని గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి అక్కడ “Signal ” అని టైపు చెయ్యండి తర్వాత ఇన్ స్టాల్ బటన్ పై నొక్కి ఇన్స్టాల్ చేసుకోవాలి.
- తర్వాత open నొక్కి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, దానికి OTP వస్తుంది అది ఎంటర్ చేసి ఇంకా వాడుకోవచ్చు.