సాయం అందలేదని విజయవాడ వరద బాధితుల నిరసన | Vijayawada Flood Victims Protest

WhatsApp Group Join Now

విజయవాడ వరద బాధితుల ఆవేదన

విజయవాడలో ఇటీవల భారీ వరదలు కారణంగా అనేక మంది ప్రజలు తమ ఇళ్లు, సామాను, జీవితాన్ని కోల్పోయారు. రెండు వారాలుగా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము కూడా ఈ సమాజంలో భాగమేనని, అందరికీ మాదిరిగా తమకూ న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు.

సాయం రాకపోవడం – బాధితుల ఆందోళన

వరద బాధితులు విజయవాడలో రోడ్డుపై బైఠాయించి తమ గోడును వెలిబుచ్చారు. “ప్రభుత్వం మాకు ఏ న్యాయం చేయలేదు. మా ఇళ్లు, వస్తువులు నీటిలో మునిగిపోయాయి, సాయం అందలేదు” అని వారు అన్నారు. కలెక్టర్, అధికారులు వచ్చి పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు. “ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా, ఎలాంటి స్పందన రాలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల లాటీ చార్జ్

ప్రభుత్వం సాయం చేయకపోవడంపై బాధితులు నిరసనగా రోడ్డు ఎక్కగా, పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని లాటీ చార్జ్ చేశారు. మహిళలను కూడా చూడకుండా, అందరిని బయటకు తరిమారు. “న్యాయం కోరితే లాటీ చార్జ్ చేస్తారా?” అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మళ్ళీ ఆందోళన చేస్తామన్నవరద బాధితులు

బాధితులు, “రేపటికి కూడా సాయం అందకపోతే మేము మళ్ళీ రోడ్డు ఎక్కుతాం. ఈ సారి లాటీ చార్జ్ కాదు, ప్రాణాలు పోయినా పోరాడుతాం” అని హెచ్చరించారు.


ఇది కూడా చదవండి – విజయవాడ వరద బాధితులకు YSRCP పార్టీ నిత్యావసరాల పంపిణీ

వీడియో

Vijayawada Flood Victims Protest Against Chandrababu Government

Leave a Comment