మూఢనమ్మకం పేరుతో ఊరంతా ఖాళీ చేసిన గ్రామస్థులు | Villagers Abandon Entire Village Due to Superstition in Nalgonda

WhatsApp Group Join Now

నల్గొండ జిల్లా: సాంకేతికంగా ఎంతగా ప్రపంచం ముందుకెళ్తున్నా, కొన్ని మూఢనమ్మకాలు ఇంకా ప్రజలపై ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. నల్గొండ జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న ఘటన అందుకు నిదర్శనం.

ఊరంతా ఖాళీ

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామం, మూఢనమ్మకం పేరుతో ఖాళీ అయిపోయింది. గ్రామస్తులంతా తమ ఇళ్లకు తాళం వేసి పొలిమేర దాటి వెళ్లిపోయారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారు ఇంటిని ఖాళీ చేస్తే గ్రామం మీదున్న కీడు పోతుందని నమ్మారు.

వరుస మరణాలు – ఆందోళన

గత కొన్ని నెలలుగా ఈ గ్రామంలో వరుసగా మరణాలు సంభవించాయి. ఆగస్టు నుండి దసరా వరకు సుమారు 30-40 మంది గ్రామస్తులు వివిధ కారణాలతో మరణించారు. ఈ ఘటనలతో గ్రామస్థులలో ఆందోళన పెరిగింది. ఈ వరుస మరణాలకు కారణం కీడు సోకిందని గ్రామస్థులు నమ్మకంతో ఉన్నారు.

కీడు పోవాలంటే ఊరు ఖాళీ చేయాలని నిర్ణయం

గ్రామ పెద్దలు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ధారణకు వచ్చారు. గ్రామానికి పట్టిన కీడు పోవాలంటే ఊరంతా ఒకరోజు ఖాళీ చేసి వదిలిపెట్టాలని తేల్చారు. 5 రోజుల క్రితం డప్పు చాటింపు చేయించి గ్రామాన్ని ఖాళీ చేయడానికి గ్రామస్థులను సిద్దం చేశారు. ఇంతే కాదు, వంటావార్పు చేసుకుని సాయంత్రం తిరిగి రావాలని గ్రామ పెద్దలు సూచించారు.

దీనితో ప్రొద్దున్నే కళ్ళాపి కూడా చెల్లకుండా అందరూ ఒకరోజు బయట ఫ్యామిలీతో ఉండడానికి, వండుకోవడానికి కావాల్సిన అన్ని సామాన్లు తీసుకొని ఇంటికి తాళం వేసి ఊరి బయట చెట్ల కింద ఫ్యామిలీతో గడిపారు.

ఇవి కూడా చదవండి

ఒక్క ఇటుక కూడా అనుమతి లేకుండా మూసి ప్రాంతంలో కూల్చలేదు – రేవంత్ రెడ్డి

చంద్రబాబుకు ఈడీ షాక్ – ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కాం

వీడియో

People Evacuated Settipalem Village at Nalgonda District

3 thoughts on “మూఢనమ్మకం పేరుతో ఊరంతా ఖాళీ చేసిన గ్రామస్థులు | Villagers Abandon Entire Village Due to Superstition in Nalgonda”

Leave a Comment