మచిలీపట్నంలో పేర్ని నాని నివాసం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేన కార్యకర్తలు భారీగా పేర్ని నాని ఇంటికి తరలి వచ్చి, ఆయనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ కోరుతూ ఆందోళన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి నాని చేసిన వ్యాఖ్యలు జనసేన అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. ఇరు వర్గాల కార్యకర్తలు నినాదాలు చేస్తూ, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.
వైసీపీ కార్యకర్తల మద్దతు
జనసేన కార్యకర్తలు నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుండగా, వైసీపీ కార్యకర్తలు మద్దతుగా నినాదాలు చేస్తూ అక్కడికి చేరారు.
రాజకీయాలను రెచ్చగొడుతున్న పవన్ పై నిప్పులు చెరిగిన పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని, మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఉడత ఊపులకు వైసీపీ నేతలు భయపడే వారే లేరని అన్నారు. కిరాయి మనుషులను పంపించి భయపెట్టడం తగదని, ఈ తరహా రాజకీయ డ్రామాలను ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఎండగడతామని హెచ్చరించారు.

కులం, మతం పేరుతో పవన్ ప్రజలను రెచ్చగొడుతున్నారు
పవన్ కళ్యాణ్ గతంలో కులం, మతం తేడాలు లేవని చెప్పి, ఇప్పుడు మతాల పేరుతో హిందువులను రెచ్చగొట్టడంపై పేర్ని నాని విమర్శించారు. రాజకీయాల్లో పవన్ కాలం చెల్లిందని, జనాలు ఆయన డ్రామాలకు ఆసక్తి చూపటం లేదని వ్యాఖ్యానించారు. గతంలో బాప్టిజం తీసుకున్న పవన్, ఇప్పుడు సడన్ గా హిందువులను మద్దతుగా మాట్లాడడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు.
తప్పుదోవ పట్టించే రాజకీయాలు ఆపాలి
పేర్ని నాని, పవన్ కళ్యాణ్ తప్పుడు రాజకీయాలపై నిలదీస్తూ, ప్రజలను రెచ్చగొట్టే చర్యలు ఆపాలని స్పష్టం చేశారు. రౌడీలను, తాగుబోతులను ముందుకు నెట్టి భయపెట్టడం తగదని అన్నారు. మచిలీపట్నం పోలీసులు తప్పుడు పని చేస్తే, హింసా రాజకీయాలు మొదలవుతాయని కూడా హెచ్చరించారు.
పవన్ తప్పుడు హామీలు: స్టీల్ ప్లాంట్ అంశం
పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడంపై కూడా పేర్ని నాని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడతానని చెప్పిన పవన్, ఇప్పుడు ఆ అంశం గురించి ఏమి మాట్లాడటం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు.
ఇది కూడా చదవండి – తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే వల్ల మహిళా వీఆర్ఓ ఆత్మహత్యాయత్నం
1 thought on “పేర్ని నాని ఇంటి పై జనసేన కార్యకర్తల దాడి | Janasena Leaders Attack on Perni Nani House”