తణుకు అన్నా కాంటీన్ వ్యవహారంపై మాట్లాడిన లోకేష్ | Nara Lokesh Dismisses Opposition’s Claims on Anna Canteen Operations

WhatsApp Group Join Now

అన్నా కాంటీన్

కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలకే పధకాలు ఇచ్చిందేమి లేదు కానీ అమలు చేసిన అన్నా కాంటీన్ల నిర్వహణ కూడా సరిగ్గా చేయలేకపోయారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అన్న కాంటీన్ లో కనీస శుచి, శుభ్రతలేకుండా మురికి నీళ్లతో అన్నం తినే ప్లేట్ లను కడుగుతున్న వీడియో ఒకటి ఈ మధ్య వైరల్ అయ్యింది.

నారా లోకేష్ ఏమన్నాడంటే

Nara Lokesh AP Education Minister

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్ష నాయకులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ వాదనలను “ద్వేషపూరిత ప్రచారం”గా లోకేష్ అభివర్ణించారు. ప్రజలకు తక్కువ ధరకే భోజనం అందించడంలో కీలకమైన అన్న క్యాంటీన్ల ప్రతిష్టను దెబ్బతీయడమే తమ ముందున్న లక్ష్యమని ఉద్ఘాటించారు.

అన్నా క్యాంటీన్లలో ఆహార తయారీ మరియు భద్రత రెండింటిలోనూ అత్యున్నత ప్రమాణాలను నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్ హామీ ఇచ్చారు. క్యాంటీన్ల విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నాలను తిప్పికొడుతూ క్యాంటీన్లు పరిశుభ్రంగా, సమర్ధవంతంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన పునరుద్ఘాటించారు.

నిజం

నారా లోకేష్ గారు ఎంత చెప్పినప్పటికీ ఆ వీడియో లో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం అన్నా కాంటీన్ల నిర్వహణ సరిగా చేసి పేదవారికి మంచి ఆహరం ఆనందించాలని ఆశిద్దాం.

వీడియో

Anna Canteens Worst Maintenance

Webstory

Leave a Comment