భారతదేశపు ‘Golden Boy’ నీరజ్ చోప్రా మంగళవారం పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫైయర్ లో సత్తా చాటి ఫైనల్‌లోకి ప్రవేశించాడు.
మంగళవారం జరిగిన గ్రూప్ B క్వాలిఫికేషన్ రౌండ్‌లో, చోప్రా 89.34 మీటర్ల స్కోర్ ను నమోదు చేశాడు. ఇదే అందరికన్నా నెంబర్ వన్ స్కోర్. మరియు తన మొదటి ప్రయత్నంలోనే ఫైనల్‌కు అర్హత సాధించాడు.
తర్వాత, 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 90 మీటర్ల మార్కును అధిగమించిన పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ కూడా తన మొదటి ప్రయత్నంలోనే క్వాలిఫికేషన్ స్టాండర్డ్ దూరాన్ని దాటడంతో చోప్రా ఫైనల్‌లో చేరాడు.

మన దేశం నుండే ఇద్దరు క్రీడాకారులు
మన దేశానికే చెందిన ఇద్దరు అథ్లెట్ లు ఈ జావెలిన్ త్రో క్వాలిఫైయర్ లో పాల్గొన్నారు. గ్రూప్ A లో కిషోర్ జెనా అలాగే గ్రూప్ B లో నీరజ్ చోప్రా.

గ్రూప్ – B లో నీరజ్ చోప్రా 89.34 మీటర్ల స్కోరుతో అందరి కన్నా మొదటి స్థానంలో ఉంటే, గ్రూప్ A లోని కిషోర్ జెనా 80.73 మీటర్ల స్కోరుతో (9th place) క్వాలిఫై కాలేక వెనుతిరుగుతున్నాడు.
ఒలింపిక్ జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ ఆగష్టు 08వ తారీఖున జరగనుంది. మనమందరం నీరజ్ చోప్రా గెలిచి దేశానికి బంగారు పథకం తేవాలని ఆశిద్దాం.
ట్విట్టర్ పోస్ట్
NEERAJ CHOPRA STORMS INTO THE FINAL WITH 8️⃣9️⃣.3️⃣4️⃣ THROW. 🚀pic.twitter.com/QqQa0zhuku
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 6, 2024
FAQ (Frequently Asked Questions)
Did Neeraj Chopra qualify for the Olympics in 2024?
Answer: Yes
Did Kishore Jena qualify for the Olympics?
Answer: No, He is Disqualified
నీరజ్ చోప్రా 2024 ఒలింపిక్స్కు అర్హత సాధించారా?
Answer: అవును
Where can I watch the Olympics 2024 javelin throw?
Answer: JioCinema website and app