భారత్ కు మరొక పథకం తెచ్చిన నీరజ్ చోప్రా | Neeraj Chopra Won a Silver Medal in the Lausanne Diamond League

WhatsApp Group Join Now

స్విట్జర్లాండ్ కి చెందిన లాసానే నగరంలో జరిగిన, లాసానే డైమండ్ లీగ్‌లో భారతదేశానికి చెందిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా, తన అద్భుత ప్రదర్శనతో మరోసారి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో నీరజ్, తన అత్యుత్తమ ప్రదర్శనతో 2వ స్థానం సాధించి దేశానికి గర్వకారణం అయ్యాడు.

Neeraj Chopra Finishes Second in Lausanne Diamond League
Neeraj Chopra Finishes Second in Lausanne Diamond League

జావెలిన్ త్రోలో ప్రపంచవ్యాప్తంగా ఒక మెరుగైన క్రీడాకారుడిగా నిలిచిన నీరజ్, 89.49 మీటర్లు దూరం త్రో చేసి 2వ స్థానంలో నిలిచాడు.  లాసానే డైమండ్ లీగ్‌లో ఇతర దేశాల ప్రాతినిధ్యాన్ని ధీటుగా ఢీకొట్టిన నీరజ్, తన ప్రదర్శనతో మరియు ఉత్తమ ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు.

కరేబియన్ దీవులలో, గ్రెనడా  దేశానికి చెందిన 26 ఏళ్ళ ఆండర్సన్ పీటర్స్ 90.81 మీటర్లు త్రో విసిరి మొదటి స్థానంలో ఉన్నాడు. కానీ నీరజ్ సిల్వర్ మెడల్‌కి పాత్రమైన ప్రదర్శన కూడా ప్రశంసనీయం. నీరజ్ చోప్రా మరియు భారతదేశానికి, లాసానేలో సాధించిన ఈ విజయం మరో ఘనతగా నిలిచింది.

వీడియో

Neeraj Chopra Won a Silver Medal in the Lausanne Diamond League

Webstory

Leave a Comment