పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం, మంగళగిరిలోకి క్యాంప్ ఆఫీస్ మార్పు | Pawan Kalyan Rejected Government Allotted Camp Office

WhatsApp Group Join Now


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్‌ను వదిలేసి, మంగళగిరిలోని తన ఇంటిని క్యాంప్ ఆఫీస్‌గా మార్చుకుంటున్నట్లు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడలో ఉన్న ఇరిగేషన్ శాఖ భవనాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయంగా కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.విజయవాడలోని భవనాన్ని ఫర్నిచర్‌తో సహా తిరిగి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Pawan Kalyan Rejected Government Allotted Camp Office
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం, మంగళగిరిలోకి క్యాంప్ ఆఫీస్ మార్పు

పవన్ కళ్యాణ్ ఈ మార్పు వెనుక కారణాలుగా ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజల అధిక సంఖ్యలో వచ్చే పరిస్థితులను పేర్కొన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నారు.

ఈ మార్పు వెనుక వాస్తు మార్పులు, రాజకీయ సెంటిమెంట్ వంటి కారణాలు కూడా చర్చకు వస్తున్నాయి. గతంలో ఇరిగేషన్ కార్యాలయం వాడిన మంత్రులు ఎన్నికల్లో ఓడిపోయారని, అందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి – పిఠాపురం వరద బాధితులను సందర్శించిన జగన్

వీడియో

AP Deputy CM Pawan Kalyan Key Decision On Camp Office

Webstory

1 thought on “పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం, మంగళగిరిలోకి క్యాంప్ ఆఫీస్ మార్పు | Pawan Kalyan Rejected Government Allotted Camp Office”

Leave a Comment