ఎస్సీల, బహుజనుల పట్ల ఈ విధమైన వివక్ష ఎందుకు చూపిస్తున్నారంటూ డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆసిఫాబాద్ జిల్లా వాసి, స్టేషన్ ఘనపూర్ సంక్షేమ గురుకుల హాండ్ బాల్ అకాడమీ విద్యార్థి ఎ. తిరుపతి 10వ ఆసియన్ జూనియర్ మెన్స్ హాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు భారత జట్టులో చోటు సంపాదించాడు. ఈ పోటీలు జోర్డాన్‌లో జరుగుతున్నాయి.
ఈ బాలుడు జోర్డాన్ వెళ్లేందుకు, కోచింగ్ తీసుకోవడానికి అవసరమైన ఖర్చు ₹2,20,000 రూపాయలు కాగా, ఈ మొత్తం ప్రభుత్వమే భరించాల్సింది. అయితే ప్రభుత్వ సాయం అందకపోవడంతో తిరుపతి తండ్రి అప్పు చేసి ₹70,000 సొమ్ము తెచ్చారు. మిగిలిన డబ్బును ఆయన టీచర్లు, శ్రేయోభిలాషులు సహకరించి సమకూర్చి బాలుడిని జోర్డాన్‌కు పంపించారు.

క్రికెటర్ సిరాజ్‌కు కోట్ల రూపాయల నజరానాలు, బంజారాహిల్స్‌లో 600 గజాల స్థలం కేటాయించగలిగిన ప్రభుత్వం, ఈ ప్రతిభావంతుడికి రెండు లక్షల రూపాయలు కేటాయించలేకపోవడం సిగ్గుచేటని RS ప్రవీణ్ కుమార్ గారు విమర్శించారు.
ఎస్సీల, బహుజనుల మీద మరీ ఇంత వివక్షనా @revanth_anumula గారు?
ఈ ఫోటోలోని బాలుడి పేరు ఎ. తిరుపతి, ఆసిఫాబాదు జిల్లా వాసి. స్టేషన్ ఘనపూర్ సంక్షేమ గురుకుల హాండ్ బాల్ అకాడమీ లో చదువుతున్నాడు.
ఈ బాలుడు 10th Asian Junior Men Hand Ball Championship పోటీలకు భారత టీంలో సెలక్టు అయ్యిండు. ఇవీ… pic.twitter.com/vsAvzCCBdM— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) September 3, 2024