మాజీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ను గురువారం హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద 2021లో జరిగిన దాడి కేసుకు సంబంధించింది. నందిగం సురేశ్, ఆయన సహచరులు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు గాని, కోర్టు వారి పిటిషన్‌ను తిరస్కరించింది.

పోలీసులు హైదరాబాద్‌లోని మియాపూర్ గెస్ట్ హౌస్‌లో అతడిని పట్టుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతని పై దాఖలైన కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో మరికొంతమంది వైసీపీ నేతలు లెళ్ళ అప్పి రెడ్డి, దేవినేని అవినాష్ కూడా ఉన్నారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పరచారు.
సురేష్ గారు ఏమన్నారంటే
తండ్రి, కొడుకులు (చంద్రబాబు, లోకేష్) ఇద్దరు కలిసి నన్ను బలి పశువును చెయ్యాలని చూస్తున్నారు. 2014లో కూడా తనను చాల ఇబ్బంది పెట్టారని, ఒకటి 2 సార్లు కాదు ఇది మూడో సరి అని, తనకు దేవుని సహాయం ఉందని అన్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసిన తగ్గేదేలేదు, జై జగన్ అని నినాదాలు చేసారు.
నందిగం సురేష్ భార్య ఏమన్నారంటే

తన భర్త ఏమి నేరం చేయలేదని, ఏమి కేసులు లేవని అన్నారు. తన భర్త ఏమైనా అన్యాయం చేస్తా కెమెరాలో కూడా కనిపించలేదు, ఏమి ఆధారాలు లేకుండా అన్యాయంగా కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
మీకు లెక్క మేము ఓటుకు నోటు కేసులు చెయ్యలేదని, మీరు గెలిచిన సమయం నుండి చాల మందిని నరికి చంపారని, మేము ఆలా చెయ్యకపోయినా మమ్మల్ని టార్గెట్ చేసి కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారని అన్నారు. తమ కన్నీళ్లను దేవుడు చూస్తున్నారని దానికి ఫలితం చంద్రబాబు ఒకరోజు అనుభవించాల్సి వస్తుందని అన్నారు.
తన భర్తకు ఎలాంటి హాని తల పెట్టిన హైకోర్టు లేదా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
వీడియో
.@ncbn, @naralokesh నన్ను మళ్లీ బలి పశువును చేయాలని చూస్తున్నారు
2014 నుంచి @JaiTDP నన్ను వేధిస్తోంది. ఎన్ని కేసులు పెట్టినా జై జగన్ అనే నినాదం అనడం మాత్రం మానను
-అక్రమ అరెస్ట్‌పై మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు pic.twitter.com/GLlRpwJZWw
— YSR Congress Party (@YSRCParty) September 5, 2024