ఈనాడు, ఆంధ్రజ్యోతిపై వైఎస్‌ జగన్‌ పరువునష్టం కేసు | YS Jagan defamation Case on Eenadu and Andhra Jyothi

WhatsApp Group Join Now

మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి గారు  ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై పరువు నష్టం కేసులు వేయనున్నట్లు ప్రకటించారు. మీడియా వారు తటస్థంగా వ్యవహరించడం లేదని, ప్రత్యేకంగా ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఈ పత్రికలు తన పై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, దీనికి చట్టపరమైన పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

మీడియా పై సీరియస్ ఆరోపణలు

జగన్ గారు మాట్లాడుతూ, తాను పలు సార్లు సమగ్ర ఆధారాలతో నిజాలు అందుబాటులో ఉంచినప్పటికీ, కొన్ని మీడియా సంస్థలు సత్యాన్ని వక్రీకరించి తన ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.

ప్రత్యేకంగా, రాష్ట్రానికి అమలైన ఇన్‌స్టర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జ్‌లు ఒక ముఖ్యమైన రాయితీ అని, దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారా?

“పత్రికల్లో వచ్చే ఆరోపణలు నమ్మకానికి అనర్హం. పత్రికలు నిరాధారమైన కథనాలతో అపఖ్యాతి పాలు చేస్తున్నాయని అని ఆయన మండిపడ్డారు.

ఈ ఆరోపణలపై పరువు నష్టం దావాలు వేస్తానని, అందుకు సంబంధించిన అన్ని పత్రాలు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి మరియు ఈ వార్తను ఇతరులకు షేర్ చెయ్యండి

ఇవి కూడా చదవండి

మోడీని చంపేస్తానని బెదిరించిన మహిళ

ఇంట్లో అద్దెకు వచ్చి వృద్ధ జంటను హత్య చేసిన కిరాతకులు

వీడియో