పిఠాపురం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన వైఎస్‌ జగన్ | YS Jagan Visited Pithapuram Flood-Affected Areas

WhatsApp Group Join Now

పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందులను జగన్‌కు వివరించారు.

రైతులు తమ ఇళ్లను కోల్పోయి, పొలాల్లో పండించిన పంటలు నీటమునిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తాము తీవ్ర ఆవేదనలో ఉన్నామని, ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని, ఆదుకోవట్లేదని జగన్‌ వద్ద విన్నవించారు.

ముంపు కారణంగా నష్టపోయిన రైతులను, బాధితులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు జగన్. బాధితులకు న్యాయం జరిగేలా పోరాడతామని హామీ ఇచ్చారు.

YS Jagan Visits Yeleru Flood Affected Areas
YS Jagan Visits Yeleru Flood-Affected Areas

చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిఠాపురంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్ వర్షాల సమయంలో సరైన మేనేజ్మెంట్ చేయకపోవడం వల్లే మానవ తప్పిదం వలన వరదలు వచ్చాయని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వానికి వాతావరణ సమాచార సంస్థ (IMD) నుండి భారీ వర్షాలు వస్తున్నాయి అని సమాచారం ఉన్నప్పటికీ, ఎలాంటి సమీక్షలు చేయలేదు. ఇరిగేషన్ సెక్రటరీలు, కలెక్టర్లతో సమీక్షలు జరగకుండా సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వరదలు ముంచుకు వచ్చాయని జగన్ విమర్శించారు.

ఏలేరు రిజర్వాయర్ నుండి నీటిని కనీసం కిందకి వదలకుండా కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే వదలడం మొదలు పెట్టారని, అందువల్ల రిజర్వాయర్ పూర్తి స్థాయికి నిండిపోయి, సుమారు 21,500 క్యూసెక్కులు నీళ్లు కిందకి వదలాల్సి వచ్చిందని తెలిపారు.

ఇకనైనా మార్పు అవసరం

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాలుగు నెలలు పూర్తయినా ఇంకా జగన్ మీద నిందలు వేస్తూనే ఉన్నారని, జగన్ పేరు చెబుతూ పాలన చేయకుండా, నిజాయితీతో రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని సూచించారు.

ఈ మొత్తం ఘటన ప్రజల పట్ల ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చూపుతుందో ప్రతిబింబిస్తోందని జగన్ అన్నారు. ప్రతి సందర్భంలో ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి
జగన్ గారితో ఫోటో తీసుకున్నందుకు మహిళా కానిస్టేబుల్ పై చర్యలు

వీడియో

YS Jagan Visits Yeleru Flood Affected Areas Near Pithapuram

Webstory

1 thought on “పిఠాపురం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన వైఎస్‌ జగన్ | YS Jagan Visited Pithapuram Flood-Affected Areas”

Leave a Comment