మూడు ప్రధాన సమస్యలపై డిసెంబరు నుంచి వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమ బాట | YSRCP Gears Up for Major Protests on Key Issues

WhatsApp Group Join Now

రాష్ట్రంలో ముఖ్యమైన మూడు సమస్యలపై వైస్సార్సీపీ గట్టి ఉద్యమానికి సిద్ధమవుతోంది. రైతుల సమస్యలు, కరెంటు చార్జీల పెరుగుదల, విద్యార్థుల ఫీజు రీఇంబర్స్మెంట్ అంశాలపై ఈ ఉద్యమం కొనసాగనుంది. డిసెంబర్ 11న, 27న, మరియు జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలు, ర్యాలీలు నిర్వహించనున్నట్టు వైస్సార్సీపీ ప్రకటించింది.

రైతుల సమస్యలపై డిసెంబర్ 11న ఉద్యమం

డిసెంబర్ 11న అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద వైస్సార్సీపీ రైతులతో కలిసి ర్యాలీలు నిర్వహించనుంది. ధాన్యం సేకరణలో అన్యాయం, కనీస మద్దతు ధర, ఉచిత పంట బీమా పునరుద్ధరణ వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనలోకి రాబోతున్నాయి.

రైతులకు వాగ్దానం చేసిన ₹20,000 పెట్టుబడి సహాయం ఇప్పటికీ అందలేదని వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిలదీయనుంది.

కరెంటు చార్జీలపై డిసెంబర్ 27న నిరసన

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కరెంటు చార్జీలు పెంచిన విషయాన్ని నిరసిస్తూ, డిసెంబర్ 27న ఎలక్ట్రిసిటీ కార్యాలయాల ముందు భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు.

కరెంటు చార్జీలు తగ్గించాలని, ఇప్పటికే పెంచిన ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయనుంది వైస్సార్సీపీ.

ఫీజు రీఇంబర్స్మెంట్ కోసం జనవరి 3న ఉద్యమం


జనవరి 3న విద్యార్థుల ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో కలెక్టరేట్ల వద్ద నిరసనలు జరగనున్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.3900 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వైస్సార్సీపీ ఆరోపిస్తోంది.

ప్రజల భవిష్యత్ కోసం పోరాటం

ఈ మూడు కార్యక్రమాలతో వైస్సార్సీపీ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మీరు ఈ అంశాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి.

మీకు ఈ వార్త నచ్చితే ఇతరులకు షేర్ చెయ్యండి.

ఇవి కూడా చదవండి


“రా ఎన్టీఆర్” పేరుతో పేదలకు ఉచిత భోజనం అందిచబోతున్న అభిమానులు

రేషన్ బియ్యం షిప్ సీజ్ పై రాజకీయ దుమారం 

వీడియో